తెలంగాణ ముఖ్యమంత్రి సహాయనిధికి ‘నాటా’ రూ.5 లక్షల విరాళం
నాటా | కరోనా వైరస్ వ్యాప్తిని కట్టడి చేయడానికి, రోగులకు మెరుగైన చికిత్స అందించేందుకు నాటా తన వంతు సహాయంగా తెలంగాణ ప్రభుత్వానికి రూ.5 లక్షల సహాయాన్ని ప్రకటించింది.

హైదరాబాద్ : కరోనా వైరస్ వ్యాప్తిని కట్టడి చేయడానికి, రోగులకు మెరుగైన చికిత్స అందించేందుకు నాటా తన వంతు సహాయంగా తెలంగాణ ప్రభుత్వానికి రూ.5 లక్షల సహాయాన్ని ప్రకటించింది. ఈ మేరకు రూ.5 లక్షల సహాయాన్ని గురువారం తెలంగాణ ముఖ్యమంత్రి సహాయనిధికి జమ చేసింది.
గత ఏడాది కూడా కరోనా సమయంలో నాటా (నార్త్ అమెరికా తెలుగు అసోసియేషన్) రూ.10 లక్షల సహాయాన్ని అందించింది.
కరోనా వైరస్ వ్యాప్తిని నిరోధించేందుకు ప్రతి ఒక్కరు ప్రయత్నించాలని, ప్రభుత్వానికి సహాయం చేయాలని నాటా ప్రెసిడెంట్ రాఘవరెడ్డి, వైస్ ప్రెసిడెంట్ అమర్నాథ్ గుండా, సెక్రటరీ రామిరెడ్డి, ట్రెజరర్ నారాయణ రెడ్డి కోరారు.
కరోనాను కలిసికట్టుగా ఎదుర్కొందామన్నారు. ప్రపంచ మానవాళి కరోనా నుంచి వీలైనంత త్వరగా విముక్తి కావాలని వారు ఆకాంక్షించారు.
రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోష్‌కుమార్, ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ వినోద్ కుమార్ సూచనలతో నాటా సీఎంఆర్ఎఫ్కు తన వంతు సహాయాన్ని అందించిందన్నారు.
అలాగే తెలంగాణకు అవసరమైన సహాయాన్ని అందించడానికి నాటా ఎల్లప్పుడు సిద్ధంగా ఉందని వారు పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి..
కరోనా ఉధృతిపై వరంగల్‌లో మంత్రుల సమీక్ష
మానవత్వాన్ని చాటుకున్న సూపర్ స్టార్..!
సమన్వయంతో పని చేద్దాం..కరోనాను తరిమేద్దాం
ఇండియాకు ఆక్సిజన్ కోసం ఓవర్‌టైమ్ పని చేస్తున్నాం: చైనా
Read Today's Latest Nri News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Parvesh Verma | యయునా నది వెంట బర్త్‌డే వేడుకలు జరుపుకోండి : ఢిల్లీ మంత్రి
Dussehra Special | తొమ్మిది రోజులు కూర్చోరు.. నేలపై పడుకోరు! ఈ గ్రామంలో దసరా నవరాత్రుల్లో వింత మొక్కు!
Idupu Kayitham | దసరా శుభాకాంక్షలు తెలిపిన ‘ఇడుపు కాయితం’ టీమ్.. ఆకట్టుకునే కొత్త పోస్టర్ విడుదల!
KTR | జమ్మి పూజ, పాలపిట్ట దర్శనం.. తెలంగాణ సంప్రదాయాన్ని గుర్తు చేస్తూ కేటీఆర్ దసరా శుభాకాంక్షలు!
Warangal Hospital | వరంగల్ సూపర్ స్పెషాలిటీ దవాఖాన ప్రారంభోత్సవం వాయిదా
ట్రెండింగ్ వార్తలు
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!

