Nagaraju gurrala | జగిత్యాల నియోజకవర్గానికి చెందిన నాయకుడిగా, దక్షిణాఫ్రికా బీఆర్ఎస్ ఎన్ఆర్ఐ విభాగం అధ్యక్షుడిగా జీవన్ రెడ్డిని బీఆర్ఎస్ పార్టీ కుటుంబంలోకి ఆదరణతో స్వాగతిస్తున్నానని బీఆర్ఎస్ ఎన్నారై సౌతాఫ్రియా అధ్యక్షుడు నాగరాజు గుర్రాల అన్నారు. ఈ చారిత్రాత్మక సందర్భంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్వయంగా జగిత్యాలలోని జీవన్ రెడ్డి నివాసానికి వెళ్లి పార్టీ శ్రేణులతో కలిసి ఆయనను సాదరంగా బీఆర్ఎస్ పార్టీలోకి ఆహ్వానించారు.
ఇది కేవలం ఒక రాజకీయ చేరిక మాత్రమే కాదు. ఒక నిజాయితీపరుడైన నాయకుడికి లభించిన సముచిత గౌరవం. జీవన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో దశాబ్దాలపాటు అంకితభావంతో, నిస్వార్థంగా సేవలందించారు. కానీ అక్కడ గౌరవం, నిజాయితీ కోసం చేసే నాయకుడికి స్థానం లేకుండాపోయింది. మున్సిపల్ ఎన్నికల సమయంలో నిరాడంబరంగా పనిచేసిన కార్యకర్తలకు టికెట్లు దక్కకుండా, ఆఖరుకు ఆయన స్వతంత్ర అభ్యర్థులకు మద్దతుగా ఇంటింటికీ తిరిగి ప్రచారం చేయాల్సిన పరిస్థితి వచ్చింది .
ఇది ఆయన నాయకత్వ నిబద్ధతకు నిదర్శనం. జగిత్యాల నియోజకవర్గం నుండి వచ్చిన వ్యక్తిగా, జగిత్యాల టైగర్ అని పేరుపడిన జీవన్ రెడ్డి చేరికపై నాకు ప్రత్యేక గర్వంగా, ఆనందంగా ఉంది. ఆయన అనుభవం, నాయకత్వ లక్షణాలు బీఆర్ఎస్ పార్టీకి నిజంగా బలమైన పునాది అవుతాయి.
కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఉద్యమించిన ఆ విప్లవ స్ఫూర్తితో, జీవన్ రెడ్డి ఇప్పుడు బీఆర్ఎస్ కుటుంబంలో భాగమవుతున్నందుకు సంతోషంగా ఉంది. ఇది మాకందరికీ ఆశాజ్యోతి. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ ప్రజలకు ద్రోహం చేస్తున్న నేపథ్యంలో, జీవన్ రెడ్డి రాష్ట్రవ్యాప్తంగా పర్యటించి తమ అనుభవాలు పంచుకుంటే, తెలంగాణ ప్రజలకు వాస్తవం అర్థమవుతుంది. ఆ సత్యం వెలుగులోకి తెచ్చే ఆయన స్వరం బీఆర్ఎస్ పార్టీకి అమూల్యమైన ఆస్తి అని తెలిపారు.
Sai Srinivas | బెల్లంకొండ సాయి శ్రీనివాస్ పెళ్లికి ముహూర్తం ఖరారు.. లగ్నపత్రిక వేడుక ఫోటోలు వైరల్!
INCA 2026 | ఉత్తమ నటుడిగా నాగ చైతన్య… రష్మికకు బెస్ట్ యాక్ట్రెస్ అవార్డు