ఆస్ట్రేలియా : ఎమ్మెల్సీ కవిత జన్మదినాన్ని పురస్కరించుకొని ఆస్ట్రేలియాలోని సిడ్నీ, మెల్బోర్న్, కాన్బెర్రా, బ్రిస్బేన్, అడిలైడ్ పట్టణాలలో టీఆర్ఎస్ ఆస్ట్రేలియా అధ్యక్షుడు నాగేందర్ రెడ్డి కాసర్ల ఆధ్వర్యంలో బర్త్డే వేడుకలు ఘనంగా నిర్వహించారు. సాయిరాం ఉప్పు, రాజేష్ రాపోలు, ప్రవీణ్ రెడ్డి, రవి, శ్రీకాంత్ ఆధ్వర్యంలో కవిత దీర్ఘాయుష్షు కోసం ప్రత్యేక పూజలు, అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు.
వినయ్ సన్నీ ఆధ్వర్యంలో మెల్బోర్న్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో నాగేందర్ రెడ్డి కాసర్ల మాట్లాడుతూ..ఎమ్మెల్సీ కవిత ఆశీస్సులతో ఆవిర్భవించిన టీఆర్ఎస్ ఆస్ట్రేలియా శాఖ అనతికాలంలోనే ఆస్ట్రేలియాలోని అన్ని నగరాల్లో కార్యవర్గాల్ని ఏర్పాటు చేసి వివిధ కార్యక్రమాల్ని నిర్వహించామన్నారు.
తమకి ఈ అవకాశం కల్పించిన కవితకు కృతజ్ఞతలు తెలిపారు. వేడుకలలో టీఆర్ఎస్ ఆస్ట్రేలియా కోర్ కమిటీ నాయకులు సనీల్ రెడ్డి, ప్రవీణ్ లేదెళ్ల, సతీష్ కుమార్, సంతు, సునీల్, చైతన్య, వెంకట్, ప్రసాద్, క్రాంతి తదితరులు పాల్గొన్నారు.