కొండగట్టులో టీఆర్ఎస్ ఎన్నారై శాఖ ఆధ్వర్యంలో కవిత జన్మదిన వేడుకలు
జగిత్యాల : తెలంగాణ జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు, నిజామాబాద్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత జన్మదినం సందర్భంగా టీఆర్ఎస్ ఎన్నారై యూకే, తెలంగాణ అసోసియేషన్ ఆఫ్ యునైటెడ్ కింగ్డమ్ (టాక్) వ్యవస్థాపకుడు అనిల్ కూర్మాచలం ఆధ్వర్యంలో కొండగట్టు ఆంజనేయస్వామి దేవాలయ సన్నిధిలో భక్తులకు అన్నదానం నిర్వహించారు. దాదాపు 2వేలకుపైగా భక్తులు అన్నదానంలో పాల్గొన్నారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్, స్థానిక ప్రజాప్రతినిధులు, టీఆర్ఎస్ నేతలు హాజరయ్యారు. కొండగట్టు ఆంజనేయస్వామి సన్నిధిలో ప్రత్యేక పూజలు చేసి, నిండు నూరేళ్లు ఆరోగ్యంగా ఉండి, ప్రజా జీవితంలో ఇంకా ఎన్నో ఉన్నతమైన పదవులు పొంది ప్రజలకు మరింత సేవ చేయాలన్నారు.

సీఎం కేసీఆర్ ఆరోగ్యంగా ఉండాలని పూజలు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రవి శంకర్ కేక్ కట్ చేసి, బర్త్ డే వేడుకల్లో పాల్గొన్నారు. కొండగట్టులో భక్తులకు అన్నదానం చేయడంతో పాటు ఎన్నో సేవాకార్యక్రమాలు చేస్తున్న కుర్మాచలం అనిల్ బృందాన్ని అభినందించారు. అలాగే ఉద్యమంలో ఎన్నారైల పాత్ర గొప్పదన్నారు. ముఖ్యంగా లండన్ నుంచి ఎన్నారై టీఆర్ఎస్ ఇచ్చిన స్ఫూర్తి గొప్పదని పేర్కొన్నారు. ఎమ్మెల్సీ కవిత ఇంకా ఎన్నో పుట్టిన రోజులు జరుపుకోవాలని ప్రార్థించారు. అనంతరం అనిల్ మాట్లాడుతూ కొండగట్టుపై అన్నదాన కార్యక్రమానికి సహకరించినందుకు ఎమ్మెల్యే, స్థానిక ప్రజాప్రతినిధులకు, ఆలయ సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు. అలాగే కార్యక్రమంలో సేవలందించిన రాజ్ కుమార్ శానబోయిన, రాజేశ్ భండారి, దూస గణేశ్, ప్రమోద్ కక్కెర్ల, సుధాకర్, మారుతీని అభినందించారు. అనంతరం పలువురు నిరుపేదలకు దుస్తులు పంపిణీ చేశారు.
Read Today's Latest Nri News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

