Singapore | తెలంగాణ కల్చరల్ సొసైటీ (సింగపూర్) ఆధ్వర్యంలో ఘనంగా శివాలయాల సందర్శన యాత్ర
Singapore | మహాశివరాత్రి సందర్భంగా తెలంగాణ కల్చరల్ సొసైటీ (సింగపూర్) ఆధ్వర్యంలో శివాలయాల సందర్శన యాత్రను నిర్వహించారు. మార్చి 8వ తేదీ రాత్రి 9 గంటల నుంచి మార్చి 9వ తేదీ ఉదయం 7 గంటల వరకు సింగపూర్‌లో ఉన్న దాదాపు 10 నుంచి 12 ప్రముఖ శివాలయాలను సందర్శించారు. గత ఏడాది ఈ సందర్శన యాత్రను తొలిసారిగా నిర్వహించగా.. ఇది రెండోసారి కావడం విశేషం.
Singapore | మహాశివరాత్రి సందర్భంగా తెలంగాణ కల్చరల్ సొసైటీ (సింగపూర్) ఆధ్వర్యంలో శివాలయాల సందర్శన యాత్రను నిర్వహించారు. మార్చి 8వ తేదీ రాత్రి 9 గంటల నుంచి మార్చి 9వ తేదీ ఉదయం 7 గంటల వరకు సింగపూర్‌లో ఉన్న దాదాపు 10 నుంచి 12 ప్రముఖ శివాలయాలను సందర్శించారు. గత ఏడాది ఈ సందర్శన యాత్రను తొలిసారిగా నిర్వహించగా.. ఇది రెండోసారి కావడం విశేషం.
సింగపూర్‌లోని జురాంగ్ ఈస్ట్-బుకిత్ పంజాంగ్, సెంగ్ కాంగ్, టాంపనీస్-బెడోక్ ప్రాంతాల నుంచి బస్సులను సమకూర్చి భక్తి యాత్రను విజయవంతంగా నిర్వహించారు. ఈ దేవాలయాల సందర్శన యాత్రలో భాగంగా వివిధ బస్సుల ద్వారా సుమారు 267 మంది భక్తులు వివిధ దేవాలయాలను సందర్శించి ఆ పరమ శివుని దీవెనలు పొందారు. యాత్రలో పాల్గొన్న భక్తులకు శివ సహస్ర నామాల ఫుస్తకం అందజేశారు. మహాశివరాత్రి సందర్భంగా సింగపూర్‌లో ఉన్న ప్రముఖ దేవాలయాలు భక్తులతో కిటకిటలాడాయి. బస్సులో భక్తుల శివనామ స్మరణలు మార్మోగాయి. ఎవరికీ ఎలాంటి ఇబ్బంది కలగకుండా చక్కని ప్రణాళికతో సురక్షితంగా యాత్రను నిర్వహించిన సొసైటీ వారికి ఈ యాత్రలో పాల్గొన్న భక్తులందరూ కృతజ్ఞతలు తెలియజేసి అభినందించారు. ఎలాంటి లాభాపేక్ష, ఆడంబరాలు లేకుండా సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు వివిధ సేవ, భక్తి కార్యక్రమాలు నిర్వహిస్తున్న తెలంగాణ కల్చరల్ సొసైటీ (సింగపూర్) వారిని ఈ కార్యక్రమంలో పాల్గొన్న భక్తులు కొనియాడారు.
ఈ కార్యక్రమానికి సమన్వయ కర్తలుగా సంతోష్ వర్మ మాదారపు, శశిధర్ ఎర్రమరెడ్డి, ఉపాధ్యక్షులు నల్ల భాస్కర్, దుర్గ ప్రసాద్, గోనె నరేందర్, ఉపాధ్యక్షురాలు సునీతారెడ్డి, ప్రాంతీయ కార్యదర్శి బొందుగుల రాము, భాస్కర్ నడికట్ల తదితరులు ఉన్నారు. వీరితో పాటు యాత్రలో సహాయపడిన పెరుకు శివరాం ప్రసాద్, బండారు శ్రీధర్, పీఎస్ఎన్ గౌడ్‌తో పాటు, శివ సహస్ర నామాల పుస్తకాలు భారత్ నుంచి సింగపూర్‌కు తీసుకురావడంలో సహాయం చేసిన చల్లా కృష్ణ, చీకట్ల తిరుపతితో ఈ పుస్తకాలను స్థానికంగా పంపిణీ చేయడంలో సహాయపడిన నంగునూరి వెంకట రమణ, మణికంఠ రెడ్డికి కృతజ్ణతలు తెలియజేశారు.
ఈ సందర్భంగా సొసైటీ అధ్యక్షులు గడప రమేశ్, ప్రధాన కార్యదర్శి బసిక ప్రశాంత్, కోశాధికారి జూలూరి సంతోష్ కుమార్ ఈ యాత్రను విజయవంతం చేసినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేశారు. గత సంవత్సరం మొదలైన ఈ భక్తి కార్యక్రమానికి భారీ స్పందన వచ్చిందని, సొసైటీ చేస్తున్న వినూత్న కార్యక్రమాలకు సహకారం అందిస్తూ ప్రోత్సహిస్తున్న సభ్యులకు, స్పాన్సర్స్‌కు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు.
Read Today's Latest Nri News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KTR | నిరుపేద విద్యార్థికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ల్యాప్‌టాప్ అందజేత
KCR | అల్లం బుచ్చవ్వ మరణం పట్ల బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంతాపం
Varanasi | వారణాసిలో రామాయణ ఘట్టం.. రాజమౌళి మార్క్ వీరత్వంతో రాముడి పాత్రను చూపించనున్నారా?
Talasani Srinivas Yadav | భాగ్యలక్ష్మి అమ్మవారి సన్నిధిలో తలసాని శ్రీనివాస్ యాదవ్.. వీడియో
Krakow Shooting: పోలాండ్‌లో కాల్పుల ఘటన.. ఆరుగురు మృతి, గన్‌మెన్ ఇంట్లో మరిన్ని మృతదేహాలు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి






