కాళేశ్వరం కమిషన్ నోటీసులు.. ప్రజాస్వామ్య విలువలను దెబ్బతీసే కుట్ర : నాగేందర్ రెడ్డి కాసర్ల
కాళేశ్వరం ప్రాజెక్టుపై న్యాయ విచారణ పేరుతో కేసీఆర్, హరీశ్‌రావుకు జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ సమన్లు జారీ చేయడాన్ని బీఆర్ఎస్ ఆస్ట్రేలియా తీవ్రంగా ఖండించింది. ఈ సమన్లు రాజకీయ ప్రతీకార ధోరణికి నిదర్శనంగా నిలుస్తాయని బీఆర్ఎస్ ఆస్ట్రేలియా అధ్యక్షుడు నాగేందర్ రెడ్డి కాసర్ల విమర్శించారు.
కాళేశ్వరం ప్రాజెక్టుపై న్యాయ విచారణ పేరుతో కేసీఆర్, హరీశ్‌రావుకు జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ సమన్లు జారీ చేయడాన్ని బీఆర్ఎస్ ఆస్ట్రేలియా తీవ్రంగా ఖండించింది. ఈ సమన్లు రాజకీయ ప్రతీకార ధోరణికి నిదర్శనంగా నిలుస్తాయని బీఆర్ఎస్ ఆస్ట్రేలియా అధ్యక్షుడు నాగేందర్ రెడ్డి కాసర్ల విమర్శించారు.
ప్రజల సంక్షేమం కోసం కృషి చేసిన నాయకులను లక్ష్యంగా చేసుకుని, వారి ప్రతిష్టను దిగజార్చే ప్రయత్నాలు చేయడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమని నాగేందర్ రెడ్డి కాసర్ల విమర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా లక్షలాది ఎకరాలకు సాగునీరు, కోట్లాది ప్రజలకు తాగునీరు అందించారని తెలిపారు. ఈ ప్రాజెక్టు నిర్మాణంలో పాలుపంచుకున్న అధికారులపై చర్యలు తీసుకోకుండా, కేవలం రాజకీయ నాయకులపై సమన్లు జారీ చేయడం వెనుక ఉన్న అసలు ఉద్దేశ్యాన్ని ప్రజలు గుర్తించాలని కోరారు.
మునుపటి కమిషన్లలోనూ, ఇప్పటి కమిషన్లోనూ బీఆర్ఎస్ నాయకులపై లక్ష్యంగా చర్యలు తీసుకోవడం, అదే సమయంలో ఇతర పార్టీల నేతలను విస్మరించడం, ఈ విచారణల రాజకీయ స్వరూపాన్ని బహిర్గతం చేస్తుందని మండిపడ్డారు. ఈ రాజకీయ కుట్రలను ఖండిస్తూ బీఆర్ఎస్ ఆస్ట్రేలియా శాఖ ప్రజల సంక్షేమం కోసం కృషి చేసిన నాయకులకు మద్దతుగా నిలుస్తుందని చెప్పారు. ప్రజల న్యాయబద్ధమైన తీర్పు, ఈ కుట్రలకు తగిన సమాధానాన్ని ఇస్తుందని నమ్ముతున్నామన్నారు.
Read Today's Latest Nri News in Telugu and Telugu News
- Tags
- BRS
- BRS Australia
- kaleshwaram
- KCR
RELATED ARTICLES
తాజా వార్తలు
House Slab Collapses | కూలిన నిర్మాణంలో ఉన్న స్లాబ్.. ఒక కార్మికుడు మృతి, నలుగురికి గాయాలు
NZvIND: 4 రన్స్‌తో తేడాతో ఇండియా విజయం.. కివీస్‌తో వన్డే సిరీస్‌లో 2-0 ఆధిక్యం
Rajnath Singh | ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ సిబ్బందితో కలసి రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్ దీపావళి వేడుకలు..!
నల్లగొండ ప్రభుత్వ ఆస్పత్రి నిర్వహణపై మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి ఆగ్రహం
Parking Dispute: పార్కింగ్ వివాదం.. 15 రౌండ్ల కాల్పులు.. టెక్ మహేంద్ర మాజీ ఉద్యోగి మృతి
ట్రెండింగ్ వార్తలు
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!

