Garikapati Avadhanam | దిగ్విజయంగా గరికపాటి తొలి అంతర్జాతీయ `స్వరరాగ శతావధానం`
Garikapati | గరికపాటి వెంకట ప్రభాకర్ తొలి అంతర్జాతీయ శతావధానం ఆన్ లైన్ వేదికపై దిగ్విజయంగా పూర్తయింది.
Garikapati Avadhanam | స్వరకర్త గరికిపాటి వెంకటప్రభాకర్ తొలి అంతర్జాతీయ స్వరరాగ శతావధాన కార్యక్రమం దిగ్విజయంగా పూర్తయింది. “వీధి అరుఁగు, నార్వే`, “యస్ యస్ మ్యూజిక్ అకాడెమీ – ఇంటర్నేషనల్” సంస్థలు సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించాయి. ఈ స్వరరాగ శతావధానంలో ఈ నెల 14 నుండి 22 వరకు 17 దేశాల నుంచి 108 మంది పృచ్ఛకులతో, 15 మంది సమన్వయకర్తలతో నిర్వహించిన కార్యక్రమం ఆద్యంతం ఎంతో ఆహ్లాదకరంగా జరిగింది.

అవధాన ప్రక్రియలో భాగంగా సంగీతజ్ఞులైన పృచ్ఛకులు శరపరంపరగా సంధించిన ప్రశ్నలకు అవధాని శ్రీ గరికిపాటి వెంకట ప్రభాకర్ అతి స్వల్పవ్యవధిలో సమాధానాలు ఇచ్చారు. ఒకసారి రాగ వర్ణనతో, మరోసారి నిషిద్ధస్వర విన్యాసంతో, ఒకతూరి రాగమాలికల కూర్పులతో, స్వరాక్షరాలతో, ఒకపరి రాగతాళ రస మార్పుల కూర్పులతో బదులిచ్చారు. కొన్ని చోట్ల అవధాని రసస్ఫూర్తి అనితర సాధ్యం అన్నట్లు ప్రకటితమైంది.
ఈ కార్యక్రమానికి సమన్వయ కర్తగా ఖతార్ నుండి విక్రమ్ సుఖవాసి వ్యవహరించారు. ముఖ్య అతిథులుగా కీ.శే. సముద్రాల లక్ష్మణయ్య గారి కుమారులు సముద్రాల విజయానంద్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సాంస్కృతిక శాఖ పూర్వ సంచాలకులు డా. విజయ్ భాస్కర్ దీర్ఘాశి, తానా పూర్వ అధ్యక్షులు జయ్ తాళ్లూరి, వంగూరి ఫౌండేషన్ అధ్యక్షులు వంగూరి చిట్టెం రాజు, తానా పూర్వ అధ్యక్షులు ప్రసాద్ తోటకూర తదితరులు పాల్గొన్నారు.

ఈ కార్యక్రమ నిర్వాహకులు వీధిఅరుఁగు వ్యవస్థాపకులు వెంకట్ తరిగోపుల మాట్లాడుతూ ఇలాంటి కార్యక్రమాలు ముందుతరాల వారికి ఒక నిఘంటువుగా ఉంటాయన్నారు. గరికపాటి అపార ప్రతిభా పాటవాలకు, సంగీతానికి చేస్తున్న కృషికి వారికి గౌరవ డాక్టరేట్ రావాలని ఆకాంక్షించారు.
విజయోత్సవ సభలో గురుదేవులను సత్కరించిన తర్వాత నిర్వాహకులను, పృచ్ఛకులను, ముఖ్య అతిథులను, స్వయంసేవకులను, ప్రత్యక్షంగా, పరోక్షంగా సేవలందించిన వారందరినీ గౌరవ మర్యాదలతో సత్కరించారు. అంతర్జాతీయంగా తొలిసారి జరిగిన ఈ శతావధానం కార్యక్రమం వండర్ బుక్ అఫ్ వరల్డ్ రికార్డ్స్, తెలుగు బుక్ అఫ్ రికార్ట్స్‌లో నమోదు చేసినట్లు అంగీకార పత్రం అందజేశారు. గురుదేవులు అందరికీ శుభం కలగాలని, ప్రతి ఒక్కరికీ శుభాశీస్సులు అందించటంతో నాలుగు రోజుల అంతర్జాతీయ స్వరరాగ శతావధానం మహాద్భుతంగా పూర్తయినది.

ఈ లింక్‌లపై పూర్తి కార్యక్రమాన్ని వీక్షించవచ్చు:
14 ఏప్రిల్ 2023 (ప్రారంభం): https://www.youtube.com/live/WKIutSKDuug
15 ఏప్రిల్ 2023 (ఉదయం): https://www.youtube.com/live/fCFCxZBDmh8
15 ఏప్రిల్ 2023 (సాయంత్రం): https://www.youtube.com/live/5Ictoq3Dc0k
16 ఏప్రిల్ 2023 (ఉదయం): https://www.youtube.com/live/rQkF_v0JI-s
16 ఏప్రిల్ 2023 (సాయంత్రం): https://www.youtube.com/live/a-wRSMI-JWw
22 ఏప్రిల్ 2023 (ఉదయం): https://www.youtube.com/live/kHKJ03GAvro
22 ఏప్రిల్ 2023 (ముగింపు): https://www.youtube.com/live/JPx3Dgs4aEM
Read Today's Latest Nri News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Singer Daler Mehndi | మాట్లాడటమే రావడం లేదు, ఇక పాటలు ఎలా పాడతారు?.. సింగర్ దాలెర్ మెహందీని నిలదీసిన మంత్రి!
Parvesh Verma | యయునా నది వెంట బర్త్‌డే వేడుకలు జరుపుకోండి : ఢిల్లీ మంత్రి
Dussehra Special | తొమ్మిది రోజులు కూర్చోరు.. నేలపై పడుకోరు! ఈ గ్రామంలో దసరా నవరాత్రుల్లో వింత మొక్కు!
Idupu Kayitham | దసరా శుభాకాంక్షలు తెలిపిన ‘ఇడుపు కాయితం’ టీమ్.. ఆకట్టుకునే కొత్త పోస్టర్ విడుదల!
KTR | జమ్మి పూజ, పాలపిట్ట దర్శనం.. తెలంగాణ సంప్రదాయాన్ని గుర్తు చేస్తూ కేటీఆర్ దసరా శుభాకాంక్షలు!
ట్రెండింగ్ వార్తలు
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!

