NRI News | లండన్‌లో వైభవంగా వాసవి కన్యకా పరమేశ్వరి జయంతి వేడుకలు
NRI News | గ్రేటర్ లండన్‌లోని సట్టన్ పట్టణంలో ఈ నెల 18న శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి జయంతి ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో ఆర్య వైశ్య కుటుంబాలు పాల్గొని సామూహిక పూజలు చేశారు.
NRI News | గ్రేటర్ లండన్‌లోని సట్టన్ పట్టణంలో ఈ నెల 18న వాసవి కన్యకా పరమేశ్వరి జయంతి ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో ఆర్య వైశ్య కుటుంబాలు పాల్గొని సామూహిక పూజలు చేశారు. భక్తి శ్రద్ధలతో శ్రీ వాసవి అమ్మవారిని కొలుచుకున్నారు. శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దక్షిణ భారతదేశంలోని ప్రముఖ దేవత. శక్తి స్వరూపిణి వాసవి అమ్మవారు శక్తి, ఆరోగ్యం, సంపదకు ప్రతిరూపంగా భక్తులు కొలుస్తారు.

సంప్రదాయ రీతిలో అలంకరించిన వేదికపై శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి విగ్రహాన్ని ప్రతిష్టించి గణేశ పూజ, వాసవి అభిషేకం, అధాంగ పూజ, షోడశోపచార పూజ, అష్టోత్తర పూజ, కుంకుమ పూజ తదితర కార్యక్రమాలు నిర్వహించారు. పిల్లలు వాసవి కథను చదివి వినిపించగా, మహిళలు వాసవి పారాయణం, చాలీసా పఠించారు. భక్తులు భజనలు, కీర్తనలు ఆలపించి, అమ్మవారి కృపను కోరారు. వేడుకల అనంతరం మహా ప్రసాద వితరణ చేశారు.

కార్యక్రమ నిర్వాహకులు మాట్లాడుతూ.. `ఈ సంవత్సరం సట్టన్లో మొదటిసారిగా శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి జయంతి ఘనంగా జరుపుకున్నాము. 34 ఆర్య వైశ్య కుటుంబాలు సామూహిక పూజలో పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది. ఈ వేడుకల ద్వారా మన పిల్లలకు మన సంస్కృతి, సంప్రదాయాలను నేర్పించడానికి ఒక మంచి అవకాశం లభించింది. ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించడానికి సహకరించిన అందరికీ ధన్యవాదాలు” అని అన్నారు. వచ్చే ఏడాది కూడా ఇలాంటి ఘనమైన వేడుకలను జరుపుకోవాలని నిర్వాహకులు ఆశాభావం వ్యక్తం చేశారు.

ఈ వేడుకలను విజయవంతంగా నిర్వహించడానికి కృషి చేసిన వీర ప్రసాద్ సూర, కృష్ణ కాకుమాని, రవి బండారు, రవి శ్రీరంగం, శ్రీకాంత్ చౌటలతో కూడిన నిర్వాహక కమిటీ, ఇతర సభ్యులను అందరూ అభినందించారు.
Read Today's Latest Nri News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

