ఆస్ట్రేలియా : తెలంగాణ రాష్ట్రంలో ఒకేసారి భారీగా 91,142 ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేసేందుకు నిర్ణయం తీసుకుంటూ అసెంబ్లీలో ప్రకటన చేయడం పట్ల టీఆర్ఎస్ ఆస్ట్రేలియా శాఖ అధ్యక్షుడు కాసర్ల నాగేందర్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. నాడు ఉద్యమం లో చెప్పినట్టుగానే నీళ్లు, నిధులు, నియామకాలే లక్ష్యంగా ఏర్పడ్డ తెలంగాణ నేడు వాటన్నిటినీ సీఎం కేసీఆర్ సారధ్యంలో సాధించుకుంటున్నామన్నారు.
నేడు తెలంగాణ అంటే బతకడం, బతికించుకోవడం, బాగుపడటం అని కేసీఆర్ ప్రపంచానికి చాటుతున్నారని స్పష్టం చేశారు. సమైక్య రాష్ట్రంలో కూడా ఒకేసారి ఇన్ని ఉద్యోగాల భర్తీ జరగలేదని కాసర్ల నాగేందర్ రెడ్డి తెలిపారు. తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయం, యాస, భాషకు నేడు ప్రపంచ ఖ్యాతిని కేసీఆర్ ప్రభుత్వం సాధించిందని కాసర్ల తెలిపారు.