Deeksha Divas | లండన్లో ఘనంగా దీక్షా దివస్
Deeksha Divas | లండన్లో దీక్షా దివస్ను బీఆర్ఎస్-యూకే శ్రేణులు ఘనంగా నిర్వహించాయి. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కేసీఆర్ చేసిన శాంతియుత పోరాటం ప్రపంచానికే ఆదర్శమని ఎన్నారైలు అభిప్రాయపడ్డారు. తెలంగాణ వచ్చుడో- కేసీఆర్ సచ్చుడో అనే నినాదంతో తలపెట్టిన దీక్ష తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ఒక కీలక ఘట్టమని పేర్కొన్నారు.
Deeksha Divas | లండన్లో దీక్షా దివస్ను బీఆర్ఎస్-యూకే శ్రేణులు ఘనంగా నిర్వహించాయి. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కేసీఆర్ చేసిన శాంతియుత పోరాటం ప్రపంచానికే ఆదర్శమని ఎన్నారైలు అభిప్రాయపడ్డారు. తెలంగాణ వచ్చుడో- కేసీఆర్ సచ్చుడో అనే నినాదంతో తలపెట్టిన దీక్ష తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ఒక కీలక ఘట్టమని పేర్కొన్నారు.
తెలంగాణ ప్రజల దశాబ్దాల కలను సాకారం చేసే క్రమంలో తన ప్రాణాలను ఫణంగా పెట్టి సకల జనులను ఏకం చేసి.. శాంతియుత పోరాటంతో రాష్ట్రాన్ని సాధించిన పెట్టిన కేసీఆర్ ఉద్యమ ప్రస్థానం ప్రపంచానికే ఆదర్శమని ఈ సందర్భంగా ఎన్నారైలు కొనియాడారు. నాడు భారత స్వాతంత్ర ఉద్యమానికి గాంధీజీ ఎంచుకున్న అహింసా పద్ధతినే.. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కేసీఆర్ పాటించారని అన్నారు. రాష్ట్ర సాధన ఉద్యమంలో ఎలాంటి హింసకు తావులేకుండా, శాంతియుతంగా ఏదైనా సాధించవచ్చని ప్రపంచానికే గొప్ప సందేశాన్ని, మార్గాన్ని చూపిన గొప్ప స్ఫూర్తిదాత మన కేసీఆర్ అని ప్రశంసించారు. ఉద్యమ నాయకుడే నేడు సేవకుడిగా.. మన రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా రావడం అదృష్టమన్నారు. బంగారు తెలంగాణ నిర్మాణానికి కేసీఆర్ అహర్నిశలు శ్రమిస్తున్నారని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో ఎన్నారై బీఆర్ఎస్ సెల్ సభ్యులు రవి ప్రదీప్ పులుసు, రవి రేటినేని, సురేశ్ గోపతి, హరి గౌడ్ నవాపేట్, సతీష్ రెడ్డి బండ, మల్లారెడ్డి బీరం, వెంకట్ రెడ్డి దొంతుల, ప్రశాంత్ కటికనేని, శ్రీకాంత్ జెల్లా, నవీన్ భువనగిరి, అబ్దుల్ జాఫర్, గణేశ్ కుప్పల, ప్రశాంత్ మామిడాల, రామకృష్ణ , ముఖ్య సభ్యులు శుషుమ్న రెడ్డి, క్రాంతి రేటినేని,
సుప్రజ పులుసు, స్నేహ నవాబుపేట్, మట్టా రెడ్డి, నవీన్, అంజన్ రావు, శశి, నరేష్ జక్కుల హాజరయ్యారు.
Read Today's Latest Nri News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Fire Accident | క్రాకర్స్ షాపులోకి దూసుకెళ్లిన రాకెట్.. భారీగా ఎగిసిపడ్డ మంటలు.. వీడియో
Lal Krishna Advani: 100 ఏళ్ల ప్రాయంలోకి భారత రత్న ఎల్కే అద్వానీ !
KTR | నిరుపేద విద్యార్థికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ల్యాప్టాప్ అందజేత
KCR | అల్లం బుచ్చవ్వ మరణం పట్ల బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంతాపం
Varanasi | వారణాసిలో రామాయణ ఘట్టం.. రాజమౌళి మార్క్ వీరత్వంతో రాముడి పాత్రను చూపించనున్నారా?
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

