KCR Birth day | ఆస్ట్రేలియాలో ఘనంగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ జన్మదిన వేడుకలు
KCR Birth day | బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ (KCR) పుట్టిన రోజు సందర్భంగా ఆస్ట్రేలియా(Australia) లో ముందస్తు వేడుకలను నిర్వహించారు.
హైదరాబాద్ : బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ (KCR) పుట్టిన రోజు సందర్భంగా ఆస్ట్రేలియా(Australia) లో ముందస్తు వేడుకలను నిర్వహించారు. సిడ్నీ, అడిలైడ్, మెల్బోర్న్, కాన్బెర్రా, బ్రిస్బేన్, గోల్డ్ కోస్ట్, బెండీగో, బల్లారాట్ నగరాల్లో్ బీఆర్ఎస్(BRS) ఆస్ట్రేలియా అధ్యక్షుడు కాసర్ల నాగేందర్ రెడ్డి(Kasarla Nagendhar reddy) ఆధ్వర్యంలో పలు కార్యక్రమాలను నిర్వహించారు. ఆలయాల్లో ప్రత్యేక పూజలు, అన్నదాన కార్యక్రమాలను అభిమానుల మధ్య కోలాహలంగా నిర్వహించినట్లు కాసర్ల నాగేందర్ రెడ్డి తెలిపారు.
అరవై ఏళ్ల స్వరాష్ట్ర కలను సాకారం చేసి, తొమ్మిదిన్నర యేండ్ల పాలనలో తెలంగాణను దేశానికే ఆదర్శంగా నిలిపిన ఘనత కేసీఆర్‌కు దక్కిందని పేర్కొన్నారు. అభివృద్ధి, సంక్షేమాలకు చిరునామాగా నిలిచిన కేసీఆర్ ఆయురారోగ్యాలతో కలకాలం ఉండాలని ఆకాంక్షిస్తున్నట్లు తెలిపారు. వినయ్ గౌడ్ సన్నీ ఆధ్వర్యంలో రక్త దానం(Blood Donations) నిర్వహించారు.
సాయిరాం ఉప్పు ఆధ్వర్యంలో మెల్బోర్న్లో, బ్రిస్బేన్ లో విన్నీ తుముకుంట, సిడ్నీలో రవిశంకర్ దుపాటి, అడిలైడ్ లో రవి యాదవ్, కాన్బెర్ర లో రవి సాయల ఆధ్వర్యంలో కేసీఆర్ జన్మదిన వేడుకలు నిర్వహించారు. వేడుకల్లో బీఆర్ఎస్ ఆస్ట్రేలియా నాయకులు ఉదయ్ రెడ్డి, విశ్వామిత్ర మంత్రిపడగ, సునిల్ రెడ్డి , శివ బిళ్ల, సుకుమార్ తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Nri News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

