Kasarla Nagender Reddy | బీఆర్ఎస్ ఆస్ట్రేలియా అధ్యక్షుడికి “బెస్ట్ ఎన్ఆర్ఐ” అవార్డు.. కేంద్ర మంత్రి చేతుల మీదుగా ప్రదానం..!
Kasarla Nagender Reddy : బీఆర్ఎస్ ఆస్ట్రేలియా అధ్యక్షుడు కాసర్ల నాగేందర్ రెడ్డి (Kasarla Nagender Reddy)కి ప్రతిష్ఠాత్మక అవార్డు లభించింది. ANN – మహా అవార్డ్స్ 2026 కార్యక్రమంలో నాగేందర్ రెడ్డి “బెస్ట్ ఎన్ఆర్ఐ'' అవార్డు అందుకున్నారు.
Kasarla Nagender Reddy : బీఆర్ఎస్ ఆస్ట్రేలియా అధ్యక్షుడు కాసర్ల నాగేందర్ రెడ్డి (Kasarla Nagender Reddy)కి ప్రతిష్ఠాత్మక అవార్డు లభించింది. ANN – మహా అవార్డ్స్ 2026 కార్యక్రమంలో నాగేందర్ రెడ్డి “బెస్ట్ ఎన్ఆర్ఐ” అవార్డు అందుకున్నారు. సామాజిక సేవ, కమ్యూనిటీ సేవలు, మేధోపరమైన కృషితో పాటు సామాజిక సమస్యలపై రాసిన వ్యాసాలకుగాను ఈ ప్రతిష్టాత్మక అవార్డు నాగేందర్ రెడ్డిని వరించింది. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చేతుల మీదుగా ఆయన ఈ అవార్డును స్వీకరించారు.
సామాజిక సేవలో ముందుండే కాసర్ల నాగేందర్ రెడ్డి గతంలో అనేకసార్లు “బెస్ట్ ఎన్ఆర్ఐ” పురస్వారం స్వీకరించారు. నిరుడు ఆస్ట్రేలియాలో జరిగిన ఓటింగ్లో అత్యధిక ఓట్లతో ఆయన “బెస్ట్ కమ్యూనిటీ లీడర్”గా గుర్తింపు సాధించారు. అంతకుముందు సంవత్సరంలో ప్రపంచవ్యాప్తంగా జరిగిన ఓటింగ్లో అత్యధిక ఓట్లు సాధించిన నాగేందర్ రెడ్డి “బెస్ట్ ఎన్ఆర్ఐ”గా నిలిచారు.

గత రెండు దశాబ్దాలుగా ఆయన వేలాది అంతర్జాతీయ విద్యార్థులకు ఉపాధి అవకాశాలు, నివాస సదుపాయాలు కల్పించడంలో కీలక పాత్ర పోషించారు. విదేశాల్లో మరణించిన వారి మృతదేహాలను స్వదేశానికి పంపించేందుకు (రిపాట్రియేషన్ సేవలు) కూడా నిరంతరం సేవలందిస్తున్నారు నాగేందర్ రెడ్డి.
తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమ సమయంలో విదేశాల్లో తన గొంతును వినిపించిన ఆయన గత 10 సంవత్సరాలుగా బీఆర్ఎస్ ఆస్ట్రేలియా శాఖ అధ్యక్షుడిగా వ్యవహారిస్తున్నారు. ANN – మహా అవార్డ్స్ 2026 కార్యక్రమంలో కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి ‘బెస్ట్ ఎన్ఆర్ఐ’ అవార్డును నాగేందర్ రెడ్డికి ప్రదానం చేశారు. ఈ సందర్భంగా నాగేందర్ రెడ్డి సేవలను పలువురు ప్రముఖులు అభినందించారు. సమాజానికి ఆయన చేస్తున్న సేవలు మరింత మందికి ప్రేరణగా నిలుస్తాయని పేర్కొన్నారు.
Read Today's Latest Nri News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Garividi Lakshmi | ‘గరివిడి లక్ష్మి’ రివ్యూ: ఉత్తరాంధ్ర జానపద కోకిల బయోపిక్ ఎలా ఉందంటే?
Sai Pallavi | కత్తి పట్టిన సీతగా సాయి పల్లవి.. అదరగొడుతున్న ‘రామాయణం’ కొత్త ప్రోమో!
Kidnap Case | సీజీఎస్టీ రిటైర్డ్ కమిషనర్ కిడ్నాప్.. గంటల్లోనే ఛేదించిన పోలీసులు
Plyometrics | వేగంగా ప్రాచుర్యం పొందుతున్న ప్లయోమెట్రిక్స్ వ్యాయామం.. అంటే ఏమిటి.. ఏం చేయాలి..?
Chaminda Vaas: ఢిల్లీ క్యాపిటల్స్ బౌలింగ్ కోచ్గా చామిండ వాస్
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

