అమెరికా : తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక బతుకమ్మ పండుగ. ఈ పూల పండుగను ప్రపంచం నలుమూలలో ఉన్న తెలంగాణ బిడ్డలు వైభవంగా జరుపుకుంటున్నారు.
అమెరికాలోని గ్రేటర్ అట్లాంటా తెలంగాణ సొసైటీ (GATES) వారి ఆధ్వర్యంలో బతుకమ్మ, దసరా ఉత్సవాలను యుగల్ కుంజ్ ఆలయంలో ఘనంగా నిర్వహించారు.
తీరొక్క పూలతో రంగురంగుల బతుకమ్మలను పేర్చి కోలాట, ఉయ్యాల పాటలతో ఆడిపాడారు. పోటీల్లో పాల్గొన్న వారికి నిర్వాహకులు బహుమతులు అంజేశారు. తెలంగాణ సంస్కృతిని చాటిచెప్పేందుకే ఇలాంటి పోటీలను నిర్వహిస్తున్నామని నిర్వాహకులు తెలిపారు.