TASA-Bathukamma | జోహన్నెస్‌బర్గ్‌లో అంబరాన్నంటిన బతుకమ్మ సంబరాలు..!
TASA-Bathukamma | తెలంగాణా అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఆఫ్రికా (టాసా) ఆధ్వర్యంలో జోహాన్నెబర్గ్ నగరంలో బతుకమ్మ పండుగ సంబరాలు అంబరాన్నంటాయి.
TASA-Bathukamma | తెలంగాణా అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఆఫ్రికా (టాసా) ఆధ్వర్యంలో జోహాన్నెబర్గ్ నగరంలో బతుకమ్మ పండుగ సంబరాలు అంబరాన్నంటాయి. దక్షిణాఫ్రికాలోని ఆడపడుచులు అందమైన బతుకమ్మలను అలంకరించి భక్తిశ్రద్ధలతో గౌరీ దేవిని సేవించుకున్నారు. వారి ఆట పాటలతో ప్రాంగణం అంతా తన్మయత్వంతో పులకరించింది. తమ అద్భుతమైన కళా ప్రదర్శనలతో బాలబాలికలు, మహిళలు ఆహూతులను అలరించారు. తెలంగాణ జానపద కళాకారుల పాటలు ఈ కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.

కేవలం ప్రవాస తెలంగాణ వాసులతోపాటు ప్రవాస కోస్తాంధ్రవాసులు, స్థానిక దక్షిణాఫ్రికా ప్రజలు కూడా పెద్ద సంఖ్యలో పాల్గొని మన సంప్రదాయాలను కొనియాడారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కాన్సులేట్ జనరల్ ఆఫ్ ఇండియా (సీజీఐ) తరపున హాజరైన డాక్టర్ వినీత్ కుమార్ (కాన్సూల్ – హెచ్ఓసీ అండ్ కామర్స్) మాట్లాడుతూ, ఇది దక్షిణాఫ్రికాలో జరుగుతున్న అతి పెద్ద భారతీయ ఉత్సవం అని అన్నారు. ఇక్కడి పండుగ వాతావరణం తనకు భారతదేశంలో ఉన్న అనుభూతిని కలిగించిందని పేర్కొన్నారు. తెలంగాణా అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఆఫ్రికా (టాసా) అధ్యక్షులు శ్రీనివాస్ తాళ్లూరి మాట్లాడుతూ తమ సంస్థ ఆధ్వర్యంలో వరుసగా తొమ్మిదో ఏటా జరుగుతున్న బతుకమ్మ ఉత్సవమని, దాదాపు 1500 మంది పాల్గొన్న ఈ భారీ ఉత్సవానికి సహాయ సహకారాలు అందించిన వారందరికి ధన్యవాదాలు తెలిపారు.

టాసా అసోసియేషన్ సభ్యులు, వారి కుటుంబ సభ్యుల కృషివల్లే బతుకమ్మ సంబురాలను ఇంత బాగా చేయగలుగుతున్నామని టాసా వైస్ చైర్మన్ యెలిగేటి వేణుమాధవ్ అన్నారు. కోశాధికారి బొబ్బాల శ్రీనివాస్ ఆర్థిక సహకారం అందించిన వారందరికి ధన్యవాదాలు తెలిపారు. దక్షిణాఫ్రికా, తెలంగాణ సంస్కృతుల్లో సామీప్యం ఉందని ఈ రెండు ప్రాంతాలకు టాసా ఒక సాంస్కృతిక వారధిగా పనిచేస్తుందని సెక్రెటరీ జనరల్ రాపోలు సీతారామరాజు అన్నారు.
Read Today's Latest Nri News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Samantha | సమంతదే నంబర్ వన్.. టాప్ 4లోకి దూసుకొచ్చిన రష్మిక మందన్నా..!
Road accident | బీదర్‌లో రోడ్డు ప్రమాదం.. ఇద్దరు సంగారెడ్డి వాసులు దుర్మరణం
Ganja Delivery Racket | డెలివరీ ముసుగులో గంజాయి దందా.. ఇద్దరిని అరెస్టు
Smart Ration Cards | తప్పుల తడకగా స్మార్టీ కార్డులు.. రంగాపూర్ బదులు చేగూరు, మేకగూడకు నందిగామ!
Rice Scam | రూ.15 బియ్యం.. రూ.100కు అమ్మకం.. రేషన్ బియ్యం రీసైక్లింగ్ దందా బట్టబయలు!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

