ATA | హైదరాబాద్‌లో ‘ఆటా’ అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు
ATA | అమెరికన్ తెలుగు అసోసియేషన్ (ఆటా) అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు హైదరాబాద్ హోటల్ గ్రీన్‌పార్క్‌లో ఈ నెల 19న ఘనంగా నిర్వహించారు. ఆటా ఇండియా బృందం నిర్వహించిన కార్యక్రమంలో దాదాపు 150 మంది పాల్గొన్నారు.
ATA | అమెరికన్ తెలుగు అసోసియేషన్ (ఆటా) అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు హైదరాబాద్ హోటల్ గ్రీన్‌పార్క్‌లో ఘనంగా నిర్వహించారు. ఆటా ఇండియా బృందం నిర్వహించిన కార్యక్రమంలో దాదాపు 150 మంది పాల్గొన్నారు. ముఖ్యఅతిధులుగా జస్టిస్ శ్రీసుధ, శాసనమండలి సభ్యురాలు సురభి వాణి పాల్గొన్నారు. కార్యక్రమంలో ఆటా ఉమెన్స్ కో ఆర్డినేటర్ ఇందుకుమార్ లైవ్ లింక్ ద్వారా ప్రారంభోపన్యాసం చేశారు. మహిళలు అన్నిరంగాల్లో సాధికారత సాధించేలా భవిష్యత్ కార్యాచరణ ప్రణాళికలు రూపొందించాలని ఆకాంక్షించారు.
జయంత్ చల్లా మాట్లాడుతూ ఆటా ఆధ్వర్యంలో భవిష్యత్‌లో మరిన్ని మంచి కార్యక్రమాలను తీసుకువస్తామన్నారు. జస్టిస్ శ్రీసుధ మాట్లాడుతూ.. కుటుంబం, విలువ, వివాహ వ్యవస్థ ఇవేవి మనం మరవొద్దని, బాధ్యతలను బట్టే మనకు జీవితంలో ప్రమోషన్ ఉంటుందన్నారు. బిడ్డగా, భార్యగా, తల్లిగా, అత్తగా, అమ్మమ్మగా ఇవన్నీ కావాల్సిందేనని, ముఖ్యంగా ఇప్పటి యువతీ యువకులు వారి ఆలోచన దృక్పథం లివింగ్ టుగెదర్.. పిల్లలు వద్దు అనేది సమంజసం కాదన్నారు. అన్ని బాధ్యతలు పరిపూర్ణంగా నిర్వహించినప్పుడే పరిపూర్ణమైన జీవితంగా భావించాలని సూచించారు.
ఆటా కోశాధికారి సతీశ్ రెడ్డి ఆటా సేవలను ఈ సందర్భంగా వివరించారు. ఎన్సీడీ గ్రూప్ రాయల్ పెవిలియన్ మొకిల్ల చైర్మన్ శ్రీనివాసరావు మాట్లాడుతూ ఆటా చేస్తున్న కార్యక్రమాలు అద్భుతమని ప్రశంసించారు. ఆటా ఇండియా రిప్రసెంటేటివ్ లోహిత్ ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించగా.. తెలంగాణ కోఆర్డినేటర్ అమృత్ ముళ్లపూడి సహకారం అందించారు. ఇండియా మీడియా కోఆర్డినేటర్ వెంకట్రావ్ మీడియా బాధ్యతలు నిర్వర్తించారు. కార్యక్రమం విజయవంతంగా నిర్వహించినందుకు ఆటా ప్రెసిడెంట్ మధు బొమ్మినేని అందరికీ ధన్యవాదాలు తెలిపారు.
Read Today's Latest Nri News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Women’s Asian Champions Trophy | చైనాపై భారత్ ఘన విజయం.. ఆసియా హాకీ ఛాంపియన్‌గా హ్యాట్రిక్
Child Marriage | టెంకంపేట్లో బాల్యవివాహానికి బ్రేక్.. అధికారుల చొరవతో నిలిపివేత
Begumpet Students | సిద్దిపేట వైజ్ఞానిక ప్రదర్శనలో బేగంపేట విద్యార్థుల ప్రతిభ.. రాష్ట్రస్థాయికి స్మార్ట్ వాకర్ ప్రాజెక్టు
Myanmar military bombs school | స్కూల్‌పై మయన్మార్ ఆర్మీ బాంబు దాడి.. మహిళలు, పిల్లలతో సహా 30 మంది మృతి
ఓబీసీ కులగణన తర్వాతే డీలిమిటేషన్ చేపట్టాలి.. బీసీ మహిళలకు సబ్‌కోటా కల్పించాలి.. జాజుల శ్రీనివాస్ డిమాండ్
ట్రెండింగ్ వార్తలు
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!

