TSWREI, TTWREI Recruitment 2023 | తెలంగాణ సాంఘిక, గిరిజన సంక్షేమం, ఏకలవ్య గురుకుల ప్రతిభ కళాశాల(Ekalavya Gurukula)ల్లో 2023-24 విద్యా సంవత్సరానికి సంబంధించి సబ్జెక్ట్ అసోసియేట్ల భర్తీకి తెలంగాణ ప్రభుత్వం ప్రకటన విడుదల చేసింది. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పోస్టులను బట్టి పీజీ, బీఈడీ ఉత్తీర్ణులై ఉండాలి. ఎంపికైన అభ్యర్థులు (ఇంటర్మీడియట్‌తో పాటు ఐఐటీ-జేఈఈ, నీట్ శిక్షణ ఇస్తున్న సీనియర్ ఫ్యాకల్టీకి సహాయంగా పార్ట్ టైం సబ్జెక్ట్ అసోసియేట్లుగా పనిచేయాల్సి ఉంటుంది).
మొత్తం పోస్టులు : 113
పోస్టులు : పార్ట్‌టైం సబ్జెక్ట్ అసోసియేట్లు
సబ్జెక్టుల వారీగా ఖాళీలు: గణితం-22, రసాయన శాస్త్రం-21, వృక్షశాస్త్రం-21, జంతుశాస్త్రం-25, భౌతికశాస్త్రం-24.
అర్హతలు : పోస్టులను బట్టి పీజీ, బీఈడీ ఉత్తీర్ణులై ఉండాలి. జేఈఈ(మెయిన్స్/అడ్వాన్స్డ్), నీట్, ఎంసెట్ శిక్షణకు సంబంధించి బోధించడంలో అనుభవం ఉండాలి.
ఎంపిక : రాత పరీక్ష, డెమో, ఇంటర్వ్యూ ద్వారా
పరీక్ష ఫీజు: రూ.500
జీతం : నెలకు రూ.32,500
దరఖాస్తు : ఆన్లైన్లో
చివరి తేదీ: జూన్ 15
రాత పరీక్ష తేదీ: జూన్ 25
డెమో/ఇంటర్వ్యూ తేదీ: జూన్ 30
వెబ్సైట్: www.tswreis.ac.in