TSES Recruitment 2023 | ఏకలవ్య ఆదర్శ పాఠశాలల్లో 239 టీచింగ్ పోస్టులు
TSES Recruitment 2023 | తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 23 ఏకలవ్య ఆదర్శ పాఠశాలల్లో పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్ (PGT), ట్రెయిన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్ (TGT), లైబ్రేరియన్ పోస్టుల భర్తీకి ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్ సొసైటీ (TSES) ప్రకటన విడుదల చేసింది.
TSES Recruitment 2023 | తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 23 ఏకలవ్య ఆదర్శ పాఠశాలల్లో పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్ (PGT), ట్రెయిన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్ (TGT), లైబ్రేరియన్ పోస్టుల భర్తీకి ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్ సొసైటీ (TSES) ప్రకటన విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా ఇంగ్లిష్, హిందీ, గణితం, భౌతికశాస్త్రం, జీవశాస్త్రం, కామర్స్, ఎకనామిక్స్, తెలుగు, ఐటీ, తదితర విభాగాలలో ఖాళీలను భర్తీ చేయనుంది. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పోస్టులను బట్టి సంబంధిత స్పెషలైజేషన్‌లో డిగ్రీ, పీజీ, బీఈడీ, పీహెచ్డీ, ఎంఫిల్, ఎంఈడీ, టెట్ ఉత్తీర్ణతతో పాటు టీచింగ్ అనుభవం కలిగి ఉండాలి. అకడమిక్ మెరిట్, టీచింగ్ అనుభవం, డెమో ద్వారా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది. ఎంపికైన అభ్యర్థులు సీబీఎస్ఈ సిలబస్‌ను ఇంగ్లిష్ మీడియంలో బోధించాల్సి ఉంటుంది. బోర్డింగ్, లాడ్జింగ్ పాఠశాల క్యాంపస్‌లో అందుబాటులో ఉండేలా సదుపాయం కల్పిస్తారు.
మొత్తం పోస్టులు : 239
పోస్టులు : పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్ (పీజీటీ), ట్రెయిన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్ (టీజీటీ)
విభాగాలు : ఇంగ్లిష్, హిందీ, గణితం, భౌతికశాస్త్రం, జీవశాస్త్రం, కామర్స్, ఎకనామిక్స్, తెలుగు, ఐటీ, తదితరాలు
అర్హతలు : పోస్టులను బట్టి సంబంధిత స్పెషలైజేషన్‌లో డిగ్రీ, పీజీ, బీఈడీ, పీహెచ్డీ, ఎంఫిల్, ఎంఈడీ, టెట్ ఉత్తీర్ణతతో పాటు టీచింగ్ అనుభవం కలిగి ఉండాలి.
ఎంపిక : అకడమిక్ మెరిట్, టీచింగ్ అనుభవం, డెమో ద్వారా
వయస్సు : జులై 01 2023 నాటికి 60 ఏండ్లు మించకూడదు.
జీతం: నెలకు పీజీటీలకు రూ.35,750; టీజీటీలకు రూ.34,125. లైబ్రేరియన్లకు రూ.30,000 వరకు
దరఖాస్తు : ఆన్లైన్లో
దరఖాస్తు ఫీజు : రూ.100. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఫీజు లేదు.
చివరి తేదీ : జులై 02
వెబ్సైట్ : https://fastses.telangana.gov.in/
Read Today's Latest Notifications News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

