TS High Court Recruitment 2023 | తెలంగాణ స్టేట్ జ్యుడీషియల్ సర్వీసులో డిస్ట్రిక్ట్ జడ్జి(ఎంట్రీ లెవెల్) పోస్టుల భర్తీకి తెలంగాణ స్టేట్ హైకోర్టు ప్రకటన విడుదల చేసింది. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పోస్టులను బట్టి విద్యార్హతతో పాటు.. తెలంగాణ హైకోర్టు లేదా దాని పరిధిలోని న్యాయస్థానాల్లో అడ్వకేట్‌గా కనీసం ఏడేళ్ల పని అనుభవం కలిగి ఉండాలి. స్క్రీనింగ్ టెస్ట్, రాత పరీక్ష, వైవా-వాయిస్ టెస్ట్ తదితరాల ద్వారా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది.
మొత్తం పోస్టులు :11
పోస్టులు : డిస్ట్రిక్ట్ జడ్జి(ఎంట్రీ లెవెల్)
అర్హతలు : పోస్టులను బట్టి విద్యార్హతతో పాటు.. తెలంగాణ హైకోర్టు లేదా దాని పరిధిలోని న్యాయస్థానాల్లో అడ్వకేట్‌గా కనీసం ఏడేళ్ల పని అనుభవం కలిగి ఉండాలి.
వయస్సు : 35 నుంచి 48 ఏండ్ల మధ్య ఉండాలి.
జీతం: రూ.1,44,840 నుంచి రూ.1,94,660.
ఎంపిక : స్క్రీనింగ్ టెస్ట్, రాత పరీక్ష, వైవా-వాయిస్ టెస్ట్ తదితరాల ద్వారా
దరఖాస్తు ఫీజు : రూ.1000. ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు రూ.500.
దరఖాస్తు : ఆఫ్‌లైన్‌లో
ఆఫ్‌లైన్ దరఖాస్తు విధానం : దరఖాస్తులను తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, సాధారణ పరిపాలన,
బూరుగుల రామకృష్ణారావు భవన్, 9వ అంతస్తు, ఆదర్శ్ నగర్, హైదరాబాద్- 500053 అడ్రస్‌కు పంపాలి.
చివరి తేదీ: 01-05-2023. మే 01
ఎంపిక పరీక్ష తేదీలు: జూన్ 24, 25
వెబ్సైట్ : tshc.gov.in