హైదరాబాద్: వరంగల్‌లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (నిట్) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలయింది. అర్హత కలిగినవారు దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. ఆన్లైన్ అప్లికేషన్లు వచ్చేనెల 23 వరకు అందుబాటులో ఉండాయని వెల్లడించింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మత్తం 123 పోస్టులను భర్తీ చేస్తున్నది. ఇందులో సీనియర్ మెడికల్ ఆఫీసర్, అసిస్టెంట్ రిజిస్ట్రార్, అసిస్టెంట్ ఇంజినీర్, ఇతర పోస్టులు ఉన్నాయి. రాతపరీక్ష, స్కిల్‌టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
మొత్తం పోస్టులు: 123
ఇందులో సీనియర్ మెడికల్ ఆఫీసర్ 1, అసిస్టెంట్ రిజిస్ట్రార్ 6, అసిస్టెంట్ ఇంజినీర్ 2, సూపరింటెండెంట్ 8, టెక్నికల్ అసిస్టెంట్ 27, జూనియర్ ఇంజినీర్ 8, లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ అసిస్టెంట్ 2, ఎస్ఏఎస్ అసిస్టెంట్ 3, సీనియర్ టెక్నీషియన్ 19, టెక్నీషియన్ 34, జూనియర్ అసిస్టెంట్ 19 చొప్పున ఖాళీలు ఉన్నాయి.
అర్హతలు: ఒక్కోపోస్టుకు ఒక్కోవిధంగా ఉన్నాయి.
ఎంపిక విధానం: రాతపరీక్ష, స్కిల్‌టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా
అప్లికేషన్ ఫీజు: సీనియర్ మెడికల్ ఆఫీసర్, అసిస్టెంట్ రిజిస్టిర్ పోస్టులకు రూ.1000, ఇతర పోస్టులకు రూ.500. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూ అభ్యర్థులకు ఎలాంటి ఫీజు లేదు.
దరఖాస్తు విధానం: ఆన్లైన్లో
దరఖాస్తులు ప్రారంభం: ఆగస్టు 23
ఆరఖాస్తులకు చివరితేదీ: సెప్టెంబర్ 23
వెబ్సైట్: https://nitw.ac.in/