IIT Kharagpur Recruitment 2023 | స్టాఫ్ నర్స్, జూనియర్ అసిస్టెంట్, జూనియర్ ఎగ్జిక్యూటివ్, సీనియర్ లైబ్రరీ ఇన్ఫర్మేషన్ అసిస్టెంట్, జూనియర్ టెక్నీషియన్, డ్రైవర్ గ్రేడ్, సెక్యూరిటీ, ఇన్స్పెక్టర్ తదితర నాన్ టీచింగ్ (Non Teaching staff) పోస్టుల భర్తీకి భారత ప్రభుత్వరంగ సంస్థ అయిన ఖరగ్‌పూర్‌లోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ) ప్రకటన విడుదల చేసింది. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పోస్టులను బట్టి సంబంధిత స్పెషలైజేషన్‌లో సంబంధిత స్పెషలైజేషన్‌లో ఇంటర్మీడియట్, బ్యాచిలర్స్ డిగ్రీ, ఇంజినీరింగ్ డిప్లొమా, ఎంబీఏ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. స్క్రీనింగ్, రాతపరీక్ష, గ్రూప్ డిస్కషన్, పర్సనల్ ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది.
మొత్తం పోస్టులు : 153
పోస్టులు: స్టాఫ్ నర్స్, జూనియర్ అసిస్టెంట్, జూనియర్ ఎగ్జిక్యూటివ్, సీనియర్ లైబ్రరీ ఇన్ఫర్మేషన్ అసిస్టెంట్, జూనియర్ టెక్నీషియన్, డ్రైవర్ గ్రేడ్, సెక్యూరిటీ, ఇన్స్పెక్టర్ తదితరాలు.
అర్హతలు: పోస్టులను బట్టి సంబంధిత స్పెషలైజేషన్‌లో ఇంటర్మీడియట్, బ్యాచిలర్స్ డిగ్రీ, ఇంజినీరింగ్ డిప్లొమా, ఎంబీఏ ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
వయసు: 25-30 ఏండ్ల మధ్య ఉండాలి.
ఎంపిక : షార్ట్‌లిస్టింగ్, పర్సనల్ ఇంటర్వ్యూ ద్వారా
దరఖాస్తు ఫీజు: రూ.500.
దరఖాస్తు : ఆన్లైన్లో
చివరి తేది: జూలై 05
వెబ్సైట్ : http://www.iitkgp.ac.in/