job news | భారతీయ రైల్వేలో 1785 అప్రెంటిస్‌లు
Apprentice | కోల్‌కతా కేంద్రంగా పనిచేస్తున్న సౌత్ ఈస్టర్న్ రైల్వే (SER)లో వివిధ విభాగాల్లో అప్రెంటిస్ (Apprentice) పోస్టుల భర్తీకి భారతీయ రైల్వే

న్యూఢిల్లీ: కోల్‌కతా కేంద్రంగా పనిచేస్తున్న సౌత్ ఈస్టర్న్ రైల్వే (SER)లో వివిధ విభాగాల్లో అప్రెంటిస్ (Apprentice) పోస్టుల భర్తీకి భారతీయ రైల్వే నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి, అర్హత కలిగినవారు దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. ఆన్లైన్ దరఖాస్తులు వచ్చేనెల 14 వరకు అందుబాటులో ఉంటాయని తెలిపింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 1785 ఖాళీలను భర్తీ చేస్తున్నది. ఎంపికైన వారు ఖరగ్‌పూర్, సత్రగచి, చక్రధర్పూర్, టాటా, ఝర్సుగూడ, రాంచీలో పనిచేయాల్సి ఉంటుంది.
మొత్తం ఖాళీలు: 1785
ఇందులో ఖరగ్‌పూర్ వర్క్‌షాప్ 360, సిగ్నల్ అండ్ టెలికమ్ 87, ట్రాక్ మెషిన్ వర్క్‌షాప్ 120, ఎస్ఎస్ఈ 28, క్యారేజ్ అండ్ వ్యాగన్ డిపో 121, డీజిల్ లోకో షెడ్ 50, సీనియర్ డీఈఈ 90, టీఆర్డీ డిపోట్ 40, ఈఎంయూ షెడ్ 40, ఎలక్ట్రిక్ లోకోషెడ్ 36, సీనియర్ డీఈఈ 93, ఎలక్ట్రానిక్ ట్రాక్షన్ డిపో 30, క్యారేజ్ అండ్ వ్యాగన్ డిపో 65, ఎలక్ట్రిక్ లోకో షెడ్ (టాటా) 72, ఇంజినీరింగ్ వర్క్‌షాప్ 100, ట్రాక్ మెషిన్ వర్క్‌షాప్ (సైనీ) 7, ఎస్ఈఈ వర్క్స్ 26, ఎలక్ట్రిక్ లోకోషెడ్ 50, డీజిల్ లోకోషెడ్ 52, సీనియర్ డీఈఈ (ఆద్రా) 30, క్యారేజ్ అండ్ వ్యాగన్ డిపో 95, డీజిల్ లోకోషెడ్ 33, టీఆర్డీ డిపో 30, ఎలక్ట్రిక్ లోకోషెడ్ (బీకేఎస్‌సీ) 31, ఫ్లాష్ బట్ వెల్డింగ్ ప్లాంట్ 25, ఎస్ఈఈ వర్క్ 24, క్యారేజ్ అండ్ వ్యాగన్ (రాంచీ) 30, టీఆర్డీ డిపో 10, ఎస్ఈఈ 10 చొప్పున ఖాళీలు ఉన్నాయి.
అర్హత: అభ్యర్థులు తప్పనిసరిగా 50 మార్కులతో పదోతరగతి, సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ ఉత్తీర్ణులవ్వాలి. 15 నుంచి 24 ఏండ్ల మధ్య వయస్సు కలిగి ఉండాలి.
ఎంపిక ప్రక్రియ: అకడమిక్ మార్కుల ఆధారంగా
దరఖాస్తు విధానం: ఆన్లైన్లో
అప్లికేషన్ ఫీజు: రూ.100
దరఖాస్తులు ప్రారంభం: నవంబర్ 15
దరఖాస్తులకు చివరితేదీ: డిసెంబర్ 14
వెబ్సైట్: rrcser.co.in
Read Today's Latest Notifications News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

