మొన్న బల్లి.. నిన్న పురుగులు
తెలంగాణ యూనివర్సిటీలోని వసతిగృహాల్లో వడ్డిస్తున్న భోజనంలో బల్లులు, పురుగులు ప్రత్యక్షమవుతున్నాయి. అన్నంలో మొన్న బల్లి రాగా, నిన్న పురుగులు వచ్చాయి. నిజామాబాద్ జిల్లా డిచ్పల్లిలోని తెలంగాణ యూనివర్సిటీలో భోజనం చేసేందుకు విద్యార్థులు వెనుకాడుతున్నారు.
- తెలంగాణ వర్సిటీ హాస్టల్లో అధ్వానంగా భోజనం
- అన్నం తినేందుకు భయపడుతున్న విద్యార్థులు పట్టించుకోని అధికారులు..
డిచ్పల్లి, జూలై 19: తెలంగాణ యూనివర్సిటీలోని వసతిగృహాల్లో వడ్డిస్తున్న భోజనంలో బల్లులు, పురుగులు ప్రత్యక్షమవుతున్నాయి. అన్నంలో మొన్న బల్లి రాగా, నిన్న పురుగులు వచ్చాయి. నిజామాబాద్ జిల్లా డిచ్పల్లిలోని తెలంగాణ యూనివర్సిటీలో భోజనం చేసేందుకు విద్యార్థులు వెనుకాడుతున్నారు. జూన్ 21న బాలికల వసతిగృహంలో విద్యార్థులకు అల్పాహారంలో బల్లి వచ్చిన ఘటన మరువక ముందే తాజాగా గురువారం రాత్రి భోజనం చేస్తున్న సమయంలో విద్యార్థిని ప్లేట్లో పురుగులు కనిపించడం కలకలం రేపింది. దీంతో విద్యార్థులంతా అన్నాన్ని బయట పడేసి, పస్తులతో పడుకుండిపోయారు.
వందల సంఖ్యలో విద్యార్థినులు ఉండే వసతిగృహంలో వంట చేసే సమయంలో సిబ్బంది జాగ్రత్తలు పాటించకుండా ఇష్టానుసారంగా వ్యవహరిస్తుండడంతో ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. చీఫ్ వార్డెన్, కేర్‌టేకర్ కిచెన్‌ను సందర్శించి, జాగ్రత్తలు సూచించకపోవడంతో ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయని విద్యార్థులు వాపోతున్నారు. మరోవైపు, వరుస ఘటనల నేపథ్యంలో రిజిస్ట్రార్ యాదగిరి శుక్రవారం ఉదయం హాస్టల్ పరిసరాలను పరిశీలించి, విద్యార్థులతో మాట్లాడారు.
తాజా ఉదంతంపై వీసీ ఆదేశాల మేరకు కాలేజీ ప్రిన్సిపాల్ ఆరతి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డైరెక్టర్ అపర్ణ, చీఫ్ వార్డెన్ మహేందర్‌తో త్రిసభ్య కమిటీని నియమించారు. ఐదుగురు సీనియర్ మహిళా ఆచార్యులతో మానిటరింగ్ కమిటీని సైతం ఏర్పాటు చేశారు. ఈ కమిటీ హాస్టల్ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడంతో పాటు నాణ్యమైన వంట సామగ్రి, తాజా కూరగాయలను అందించేందుకు కృషి చేయాలని ఆదేశించారు. మరోసారి ఇలాంటి ఘటనలు పునరావృతమైతే హాస్టల్ సిబ్బందిని తొలగించి, కలెక్టర్ ఆధ్వర్యంలో కొనసాగే అవుట్సోర్సింగ్ ఏజెన్సీకి బాధ్యతలు అప్పగిస్తామని రిజిస్ట్రార్ వెల్లడించారు.
నాణ్యమైన భోజనం అందించాలి
వర్సిటీలో చదువుకుంటున్న విద్యార్థులకు అధికారులు నాణ్యమైన భోజనం అందించాలి. గతంలో అల్పాహారం లో బల్లి రాగా.. తాజా గా గురువారం రాత్రి అన్నంలో పురుగులు వచ్చాయి. దీంతో విద్యార్థులంతా ఆందోళన చెందుతున్నారు. అధికారులు స్పందిం చి భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలి.
-జయంతి, టీయూ విద్యార్థిని
సిబ్బంది నిర్లక్ష్యంతోనే..
వంట చేసే సమయం లో సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా అన్నంలో బల్లులు, పురుగులు వస్తున్నాయి. అధికారులు ఈ విషయంపై ప్రత్యేక దృష్టి సారించాలి. అవసరమైతే ఒక కమిటీ ఏర్పాటు చేసి భోజనం వండే, వడ్డించే సమయంలో ప్రత్యేకంగా సిబ్బందిని నియమించాలి.
లేనిపక్షంలో విద్యార్థులందరం ఆందోళన చేస్తాం.
-శివ, టీయూ విద్యార్థి
Read Today's Latest Nizamabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Maganur | షార్ట్ సర్య్కూట్‌తో ఇళ్లు దగ్ధం..పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే
Chennai Metro | చెన్నైలో మెట్రో నూతన మార్గం ప్రారంభం.. ప్రధాని మోదీ, సీఎం విజయ్ తొలి ప్రయాణం..!
Violence In Manipur | మణిపూర్‌లో కొనసాగుతున్న హింస.. ఐదుగురు మృతి, పలు ఇళ్లకు నిప్పు
Delhi Police | పోలీసులపై దాడులు, అడ్డగింత.. సీజేపీ నిరసనలో 20 ఎఫ్ఐఆర్లు నమోదు
Hanumanthu Naidu | కొత్త జిల్లాల ఏర్పాటుతో విరజిమ్మిన ప్రగతి వెలుగులు : బీఆర్ఎస్ నాయకుడు హనుమంతు నాయుడు
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

