స్కూటీపై కుంభమేళాకు..
నిజామాబాద్ జిల్లా పొతంగల్ మండలకేంద్రానికి చెందిన ఇద్దరు యువకులు స్కూటీపై ప్రయాగ్‌రాజ్ కుంభమేళా యాత్రకు వెళ్లారు. వందలాది కిలోమీటర్లు ప్రయాణించి, త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు చేసి తమ స్వస్థలానికి చేరుకున్నారు. ఈ యాత్రను ఐదు రోజుల్లో పూర్తిచేయడం విశేషం.
- పొతంగల్ గ్రామానికి చెందిన యువకుల సాహసం
- 5 రోజుల్లో ప్రయాగరాజ్, కాశీయాత్ర పూర్తి
పొతంగల్, ఫిబ్రవరి 22 : నిజామాబాద్ జిల్లా పొతంగల్ మండలకేంద్రానికి చెందిన ఇద్దరు యువకులు స్కూటీపై ప్రయాగ్‌రాజ్ కుంభమేళా యాత్రకు వెళ్లారు. వందలాది కిలోమీటర్లు ప్రయాణించి, త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు చేసి తమ స్వస్థలానికి చేరుకున్నారు. ఈ యాత్రను ఐదు రోజుల్లో పూర్తిచేయడం విశేషం.
పొతంగల్ గ్రామానికి చెందిన యువకులు సితాల సంతోష్, సాదుల శ్రీధర్ స్నేహితులు, అందరూ కుంభమేళాకు వెళ్తుండడంతో తాము కూడా వెళ్లి రావాలని అనుకున్నారు. 144 ఏండ్లకు ఒకసారి వచ్చే ఈ మహా కుంభమేళాలో పవిత్ర స్నానం చేయాలని నిర్ణయించుకొని ప్రయాణానికి సిద్ధమయ్యారు. అయితే, అందరిలా వీరు బస్సులు, ట్రైన్లు, కార్లలో కాకుండా ద్విచక్రవాహనంపై వెళ్లేందుకు నిర్ణయించుకున్నారు. ఈనెల 18న పొతంగల్ నుంచి బయల్దేరారు. మొదట ప్రయాగరాజ్‌కు వెళ్లి నదీస్నానం చేశారు. అనంతరం వారణాసిలోని కాశీ విశ్వేశ్వరున్ని దర్శించుకొని తిరుగుప్రయాణమయ్యారు. మొత్తం ఐదు రోజుల్లో సుమారు 2500 కిలోమీటర్లు చుట్టేసి, శనివారం మధ్యాహ్నం స్వగ్రామానికి చేరుకోవడంతో కుటుంబీకులు, బంధుమిత్రులు ఘన స్వాగతం పలికారు. ఈ యాత్ర తమకు ఎంతో సంతోషం కలిగించిందని సదరు యువకులు తెలిపారు.
Read Today's Latest Nizamabad News in Telugu and Telugu News
- Tags
- Kumbh Mela
- scooty
- Telangana
RELATED ARTICLES
తాజా వార్తలు
IdupuKayitham | దీపావళి స్పెషల్.. ‘ఇడుపు కాయితం’ నుంచి అదిరిపోయేలా నాగదుర్గ ‘బారాత్ బీట్’ సాంగ్
PM Modi: బస్తర్‌లో భద్రతా బలగాలతో ప్రధాని మోదీ దీపావళి వేడుక.. దిమాగీ నక్సల్స్‌పై హెచ్చరిక
పింక్ శారీలో శ్రీనిధి శెట్టి పరువాల జాతర.. ఫొటోలు చూస్తే ఫిదా అవ్వాల్సిందే!
US Diwali: అమెరికాలో దీపావళి వేడుకల్ని అడ్డుకున్న అతివాదులు.. వీడియో
TTD Darshan News | తిరుమలలో కొనసాగుతున భక్తుల రద్దీ. శ్రీవారి దర్శనానికి 15 గంటల సమయం
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

