Tata Health Insurance | కామారెడ్డి : టాటా హెల్త్ ఇన్సూరెన్స్, శ్రీ విశ్వమాత్రే సొల్యూషన్స్ ఆధ్వర్యంలో శనివారం కామారెడ్డిలో హెల్త్ ఇన్సూరెన్స్ అడ్వైజర్స్ కోసం రిక్రూట్మెంట్ డ్రైవ్, శిక్షణా కార్యక్రమాన్ని అత్యంత ఉత్సాహంగా నిర్వహించారు. శ్రీ విశ్వమాత్రే సొల్యూషన్స్ భాగస్వామ్యంతో జరిగిన ఈ కార్యక్రమంలో టాటా హెల్త్ తెలంగాణ స్టేట్ హెడ్ శనివారం ప్రకటన చేశారు. టాటా హెల్త్ ఇన్సూరెన్స్ సంస్థ విస్తరణ లక్ష్యాలలో భాగంగా 2026 మార్చి నాటికి కామారెడ్డిలో కంపెనీ బ్రాంచ్‌ను అధికారికంగా స్థాపించనున్నట్లు తెలంగాణ స్టేట్ హెడ్ ప్రకటించారు.
ఈ నూతన బ్రాంచ్ ఏర్పాటుతో స్థానిక ప్రజలకు మెరుగైన సేవలందించడంతో పాటు, కామారెడ్డి నిరుద్యోగ యువతకు ఆరోగ్య బీమా రంగంలో స్థిరమైన, వృత్తిపరమైన ఉపాధి అవకాశాలు లభిస్తాయని ఆయన తెలిపారు. రాబోయే రోజుల్లో బ్రాంచ్ అవసరాల కోసం స్థానిక హెల్త్ ఇన్సూరెన్సు అడ్వైజర్, సెల్స్ మేనేజర్స్ నియామకం భారీగా చేపట్టబడుతుందని స్పష్టం చేశారు. ఈ శిక్షణా కార్యక్రమంలో రాష్ట్ర హెడ్ శ్రీ ప్రవీణ్ గోస, శ్రీ హరిప్రసాద్, శ్రీకాంత్, ట్రైనర్ స్వాతి గారు పాల్గొన్నారు. స్థానిక రిక్రూట్మెంట్పై బ్రాంచ్ వివరాల గురించి ఆసక్తి గల అభ్యర్థులు 8686762636, 9966336101 నంబర్లను సంప్రదించాలని సూచించారు.