పొట్టకూటి కోసం శ్రమజీవులు పడే బాధలు వర్ణణాతీతం. ఎండనక, వాననక ఎన్ని ఇబ్బందులెదురైనా ఎదుర్కొంటూ బతుకుబండిని ముందుకు నడిపించాల్సిందే. ఆర్మూర్ పట్టణంలోని ఎంజీ రోడ్డు పక్కన వివిధ గ్రామాల నుంచి వచ్చిన చిరువ్యాపారులు కూరగాయలు, పండ్లు విక్రయిస్తూ బతుకీడుస్తున్నారు. వేసవికాలం కావడంతో మండే ఎండలో గొడుగు కింద కూర్చొని కూరగాయలు, పండ్లు విక్రయిస్తున్నారు.