ఆహ్లాదానికి ఆలవాలం
నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని సుభాష్‌నగర్ పరిధిలో రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో ఏర్పాటు చేసిన పార్కు అందుబాటులోకి వచ్చింది. అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేశ్ గుప్తా కృషితో కొత్త అందాలను సంతరించుకొని ఆహ్లాదాన్ని పంచుతున్నది. ఈ పార్కులో స్వచ్ఛమైన గాలిని పీలుస్తూ యోగా
నిజామాబాద్, జూలై 20 : నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని సుభాష్‌నగర్ పరిధిలో రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో ఏర్పాటు చేసిన పార్కు అందుబాటులోకి వచ్చింది. అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేశ్ గుప్తా కృషితో కొత్త అందాలను సంతరించుకొని ఆహ్లాదాన్ని పంచుతున్నది. ఈ పార్కులో స్వచ్ఛమైన గాలిని పీలుస్తూ యోగా, వ్యాయామం చేసుకునే వసతులు కల్పించారు.
నడకదారులకు ట్రాక్ ఏర్పాటు చేశారు. పార్కులో సహజత్వం ఉట్టిపడేలా, కర్రలు, చెట్లను తలపించేలా కాంక్రీటుతో నిర్మించారు. గోడలపై వేసిన చిత్రాలు ఆకట్టుకుంటున్నాయి. ఉదయం, సాయంత్రం వేళల్లో చిన్నారులతోపాటు పెద్దలు సైతం ఈ పార్కును సందర్శిస్తుండడంతో కొత్తశోభను సంతరించుకున్నది. పచ్చదనంతో స్వాగతం చెబుతూ నగరవాసులను ఆకర్షిస్తున్నదీ పార్కు.

Read Today's Latest Nizamabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

