ఖలీల్‌వాడి, జూలై 29 : బీజేపీ సీనియర్ నాయకుడు కంజర్గ భూపతిరావు టీఆర్ఎస్లో చేరారు. జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన కార్యక్రమంలో అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేశ్‌గుప్తా ఆయనకు గులాబీ కండువా కప్పి ఆహ్వానించారు.
బీజేపీలో సీనియర్ నాయకుడిగా పని చేసిన భూపతిరావు తెలంగాణ బ్రాహ్మణ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడిగా, ప్రభుత్వ రిైటెర్డ్ ఎంప్లాయీస్ యూనియన్ జిల్లా అధ్యక్షుడిగా పని చేశారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ కార్పొరేటర్లు, నాయకులు పాల్గొన్నారు.