మారని‘ మందు బాబుల’ తీరు మేమింతే!
జిల్లాలో డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు వందల సంఖ్యలో నమోదువుతున్నాయి. నిత్యం పోలీసులు చేపడుతున్న తనిఖీల్లో వాహనదారులు పట్టుబడుతున్నారు. కొందరు జరిమానాలు చెల్లిస్తుండగా, మరికొందరు జైలు శిక్షలు అనుభవిస్తున్నారు. అయినా మందుబాబుల్లో ఇసుమంతైనా మార్పు రావడంలేదు.
- నిత్యం కొనసాగుతున్న డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు
- మద్యం తాగి పట్టుబడుతున్న వాహనదారులు
- వందల సంఖ్యలో కేసులు నమోదు
- రూ.లక్షల్లో జరిమానాలు.. కొందరికి జైలు శిక్షలు..మారని
వినాయక్‌నగర్, జూలై 4 : జిల్లాలో డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు వందల సంఖ్యలో నమోదువుతున్నాయి. నిత్యం పోలీసులు చేపడుతున్న తనిఖీల్లో వాహనదారులు పట్టుబడుతున్నారు. కొందరు జరిమానాలు చెల్లిస్తుండగా, మరికొందరు జైలు శిక్షలు అనుభవిస్తున్నారు. అయినా మందుబాబుల్లో ఇసుమంతైనా మార్పు రావడంలేదు. జిల్లాలో తరచూ చోటుచేసుకుంటున్న రోడ్డు ప్రమాదాలను తగ్గించేందుకు సీపీ సాయిచైతన్య అవసరమైన కట్టుదిట్టమైన చర్యలకు శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా ఎక్కువ శాతం జరిగే రోడ్డు ప్రమాదాల్లో మద్యం తాగి వాహనాలు నడపడమే కారణమని గుర్తించారు.
డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు ప్రతిరోజూ చేపట్టాలని సిబ్బందిని ఆదేశించారు. ఈ మేరకు పోలీసులు నిత్యం డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేపడుతున్నారు. ఒకపక్క పోలీసులు పకడ్బందీగా తనిఖీలు నిర్వహిస్తున్నప్పటికీ, మరోవైపు మందుబాబులు ఇవేమీ తమకు పట్టునట్లుగా వ్యవహరిస్తూ తనిఖీల్లో పట్టుబడుతున్నారు. యథేచ్ఛగా మద్యం తాగి వాహనాలు నడుపుతున్నారు. వందల సంఖ్యలో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో వాహనదారులు పట్టుబడుతున్నారు. వారిపై సంబంధిత పోలీసులు కేసులు నమోదు చేసి కోర్టుకు తరలిస్తున్నారు. కోర్టు వారికి భారీగా జరిమానాలు విధించడంతోపాటు జైలుశిక్ష సైతం విధిస్తున్నది. అయినా మందుబాబులు తమ తీరును మార్చుకోవడంలేదు. నిత్యం తనిఖీలు కొనసాగుతుండగా, మరోవైపు వాహనదారులు మద్యం తాగి వాహనాలను నడుపుతునే ఉన్నారు.
కొత్త యాక్ట్‌తో భారీగా జరిమానాలు
డ్రంక్ అండ్ డ్రైవ్‌లో పట్టుబడిన వారికి గతంలో రూ. వెయ్యి విధించేవారు. ప్రస్తుతం కొత్త అమెండ్మెంట్ యాక్ట్ అమలులోకి రావడంతో డ్రంక్ అండ్ డ్రైవ్‌లో పట్టుబడిన వాహనదారులకు రూ.10 వేల వరకు జరిమానా విధిస్తున్నారు. అంతేగాక వారం రోజుల పాటు జైలుశిక్ష సైతం విధిస్తారు. మద్యం తాగి వాహనాలు నడిపే వారిలో మార్పు తెచ్చేందుకు ఇటు పోలీసులు, అటు కోర్టు కఠినంగా వ్యవహరించినప్పటికీ, చాలామంది వాహనదారుల్లో మార్పు మాత్రం రాకపోవడం గమనార్హం. ప్రతి వాహనదారుడు ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ సురక్షితంగా గమ్యం చేరాలన్నది పోలీసు శాఖ నిత్యం చేస్తున్న ప్రయత్నమని ట్రాఫిక్ ఏసీపీ మస్తాన్అలీ పేర్కొన్నారు.
Read Today's Latest Nizamabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
నిలువు అద్దం ఎటుదిక్కు పెట్టాలి?.. కిచెన్ ఉన్నచోట నీరు ఉండవద్దు కదా! వాష్ ఏరియా ఉండటం తప్పుకాదా!?
హీరోయిన్గా అవకాశం ఇచ్చారు.. ఇన్‌స్టాగ్రామ్‌లో ఫాలోవర్స్ లేరని క్యాన్సిల్ చేశారు!
బేబీ బ్లూ ఐస్ ఫ్లవర్స్.. వెరీ వెరీ నైస్ నేచర్!
బస్‌పాస్ పోతే మళ్లీ డబ్బులే!
బీఎస్సీ ఉద్యాన కోర్సులో ప్రవేశాలకు 30న చివరి విడత కౌన్సెలింగ్
ట్రెండింగ్ వార్తలు
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!

