ఖలీల్‌వాడి, జూన్ 2: జిల్లా కేంద్రంలో నేడు (బుధవారం) బీఆర్ఎస్ సన్నాహక సమావేశం నిర్వహించనున్నట్లు పార్టీ నాయకులు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. న్యాల్కల్ రోడ్డులోని ఆర్ఎన్ కన్వెన్షన్ హాలులో నిర్వహించనున్న ఈ సన్నాహక సమావేశంలో బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వ నమోదుతోపాటు స్పెషల్ ఇంటెన్సివ్ రిజివన్(సర్) కార్యక్రమంపై అవగాహన కల్పించనున్నట్లు పేర్కొన్నారు. ఈ సమావేశం అర్బన్ మాజీ ఎమ్మెల్యే బిగాల గణేశ్‌గుప్తా ఆధ్వర్యంలో ఉదయం 11 గంటలకు నిర్వహిస్తారని పేర్కొన్నారు. ఉమ్మడి జిల్లా పరిధిలోని పార్టీ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, ముఖ్య నాయకులు హాజరవుతారని తెలిపారు.