అర్వింద్‌కు నిరసన సెగ
నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్‌కు ముస్లిం మహిళల నుంచి నిరసన సెగ తగిలింది. వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన ఆయనను అడ్డుకున్నారు. నిజామాబాద్ జిల్లా మెండోరా మండల కేంద్రంలో సోమవారం రాత్రి అర్వింద్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా సమీపంలో ఉన్న మసీదు నుంచి నమాజ్ మొదలు కాగానే..
- నమాజ్ చేస్తుండగా ఎంపీ వెక్కిరింత
- అడ్డుకున్న ముస్లిం మహిళలు
ముప్కాల్, ఏప్రిల్ 29: నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్‌కు ముస్లిం మహిళల నుంచి నిరసన సెగ తగిలింది. వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన ఆయనను అడ్డుకున్నారు. నిజామాబాద్ జిల్లా మెండోరా మండల కేంద్రంలో సోమవారం రాత్రి అర్వింద్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా సమీపంలో ఉన్న మసీదు నుంచి నమాజ్ మొదలు కాగానే.. ఇది మనకు అవసరమా? అని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. నమాజ్ పూర్తయ్యాక అర్వింద్ మాట్లాడుతూ పూజ చేసుకుంటే దేశమంతా వినిపించాలా? అని ప్రశ్నించారు. ఉత్తరప్రదేశ్‌లో ముఖ్యమంత్రి యోగి మసీదుల్లో ఉన్న 35 వేల స్పీకర్ల సౌండ్‌ను తగ్గించారని, పర్మిషన్ లేని 11 వేల స్పీకర్లను కట్ చేయించారన్నారు. హిందువులకు కావాల్సిన చట్టాలు రావాలంటే మరోసారి నరేంద్ర మోదీ రావాలని, 400 సీట్లలో గెలిపించాలని కోరారు. అప్పటికే అర్వింద్ చేసిన వ్యాఖ్యల గురించి ప్రచారం జరగడంతో ముస్లిం మహిళలు పెద్ద ఎత్తున తరలివచ్చి అడ్డుకున్నారు. ఎవరి దేవుడ్ని వారు పూజిస్తారని, ఇలా వ్యాఖ్యానించడం సరికాదన్నారు. మీకు మా ఓట్లు అవసరమా? అని ప్రశ్నించారు. ‘ఇష్టం ఉంటే వేయండి లేకుంటే వద్దు. జై శ్రీరాం’ అనుకుంటూ అర్వింద్ అక్కడి నుంచి వెళ్లిపోయారు. దీంతో మరింత నొచ్చుకున్న ముస్లిం మహిళలు అక్కడున్న బీజేపీ నేతలతో వాగ్వాదానికి దిగారు.
Read Today's Latest Nizamabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KU Faculty Recruitment | కాకతీయ యూనివర్సిటీలో నియామకాలు పూర్తయ్యేనా? 136 ఖాళీలు ఉండగా.. 49 పోస్టులకే గ్రీన్‌సిగ్నల్!
Rajinikanth | ‘జైలర్ 2’ కలెక్షన్ల పోస్టర్లు ఎందుకు వేయడం లేదు.. రజనీకాంత్ పీఆర్ కీలక వ్యాఖ్యలు!
Breast Cancer | మహిళలు రోజూ వ్యాయామం చేస్తే రొమ్ము క్యాన్సర్ ముప్పు తగ్గుతుందా?
IND vs NZ T20I | నేడు న్యూజిలాండ్‌తో రెండో టీ20.. తుదిజట్టులోకి వైభవ్ సూర్యవంశీ..!
Gangsters: ఇండియాలో మోస్ట్ వాంటెడ్.. ఆ ఇద్దరు గ్యాంగ్స్టర్లు అమెరికాలో అరెస్టు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

