కోటగిరి, జూలై 1 : వైద్యులు దేవుడితో సమానమని, వైద్యుడు అంటే కనిపించే దేవుడు అని కోటగిరి లయన్స్ క్లబ్ అధ్యక్షుడు నార్ల సాయి శ్రీనివాస్ అన్నారు.బుధవారం జాతీయ వైద్యుల దినోత్సవం సందర్భంగా నిజామాబాద్ జిల్లా కోటగిరి లైయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో స్థానిక కమ్యూనిటీ హెల్త్ సెంటర్ డాక్టర్ శ్రీకాంత్, లయన్స్ క్లబ్ కంటి వైద్యులు సందీప్‌కు శాలువా, పూలమాలతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా అధ్యక్షులు నార్ల సాయి శ్రీనివాస్ మాట్లాడుతూ వైద్య వృత్తి చాలా పవిత్రమైంది అన్నారు.
పశ్చిమ బెంగాల్ రెండో ముఖ్యమంత్రిగా పని చేసిన డాక్టర్ బిదాన్ చంద్రరాయ్ వైద్యునిగా ఎన్నో సేవలు అందించారని గుర్తు చేశారు. ఆయన జయంతి, వర్ధంతి కూడా జూలై ఒకటే కావడం విశేషమన్నారు.
ఆయన సేవలకు గుర్తుగా ప్రతి ఏటా జూలై 1న జాతీయ వైద్యుల దినోత్సవం నిర్వహించుకుంటున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ జోనల్ చైర్మన్ జానకిరావ్, లయన్స్ క్లబ్ మాజీ అధ్యక్షుడు కోటగిరి మాజీ సర్పంచ్ పత్తి లక్ష్మణ్, గోగినేని హనుమంతరావు తదితరులు ఉన్నారు.