క్షమాపణ సరే.. తప్పు చేసిందెవరు ?
రుణం తీసుకోకుండానే రుణమాఫీ జరిగిన ఘటనలో అనేక సందేహాలు వెలుగు చూస్తున్నాయి. గాయత్రీ షుగర్ ఫ్యాక్టరీ, యూనియన్ బ్యాంకు, రైతుల మధ్య జరిగిన ట్రైపార్టీ ఒప్పందం మేరకు రుణాల మంజూరు జరిగింది.
- ప్రభుత్వ మార్గదర్శకాలకు విరుద్ధంగా రుణమాఫీ మంజూరు
- వివరాల నమోదులో అడుగడుగునా నిర్లక్ష్యం
- ట్రైపార్టీ అగ్రిమెంట్ పేరుతోనే రుణాలు లేపిన యాజమాన్యం
- రైతుల్లో చర్చనీయాంశమైన “నమస్తే తెలంగాణ” కథనం
రుణం తీసుకోకుండానే రుణమాఫీ జరిగిన ఘటనలో అనేక సందేహాలు వెలుగు చూస్తున్నాయి. గాయత్రీ షుగర్ ఫ్యాక్టరీ, యూనియన్ బ్యాంకు, రైతుల మధ్య జరిగిన ట్రైపార్టీ ఒప్పందం మేరకు రుణాల మంజూరు జరిగింది. ఇందులో చట్టబద్ధతను పక్కన పెడితే రుణమాఫీ అంశంలో చోటు చేసుకున్న లోపాలు పలు అనుమానాలకు తావిస్తున్నది. ఈ విషయం ‘నమస్తే తెలంగాణ’ పత్రికలో బుధవారం మెయిన్, జిల్లా సంచికల్లో ప్రచురితం కావడంతో ప్రభుత్వ యంత్రాంగం కూడా అవాక్కయ్యింది. ఇంతటి ఘోరమైన తప్పిదం ఎలా జరిగిందో? అన్న అనుమానాలను ప్రభుత్వ పెద్దలు సైతం వ్యక్తం చేసినట్లుగా తెలిసింది.
నమస్తే తెలంగాణ కథనంపై ప్రభుత్వవర్గాల నుంచి వివరాలు ఆరా తీయడంతో కామారెడ్డి కలెక్టర్ ఆశీష్ సంగ్వాన్ అడుగు ముందుకేశారు. కామారెడ్డి ఆర్డీవో, జిల్లా వ్యవసాయ అధికారితో విచారణకు ఓ కమిటీని వేశారు. రుణమాఫీ అంశం బయటపడడంతో షుగర్ ఫ్యాక్టరీ యాజమాన్యం సైతం మల్లగుల్లాలు పడింది. ఏకంగా ఫ్యాక్టరీ ఎండీ ఆదేశాలతో రంగంలోకి దిగిన వైస్ ప్రెసిడెంట్ వేణుగోపాల్ రావు ఏకంగా రైతులకు బహిరంగ క్షమాపణలు కోరారు. తప్పు జరిగిందని, సరిదిద్దుకుంటామంటూ వ్యాఖ్యానించారు. రైతులకు తిరిగి డబ్బులు చెల్లిస్తామంటూ హామీ ఇచ్చారు. యూనియన్ బ్యాంకు నుంచి రుణాలను పదిరోజుల్లోనే కట్టేస్తామన్నారు.
-నిజామాబాద్, జూలై 24 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) / రామారెడ్డి
తప్పెవరిది…?
కామారెడ్డి జిల్లాలో రూ.కోట్లలో రుణమాఫీ నిధులు పక్కదారి పట్టడంపై తీవ్ర గందరగోళం ఏర్పడింది. ట్రైపార్టీ కింద మంజూరైన రుణాలకు వాస్తవానికి మాఫీ వర్తించదు. సర్కా రు జారీచేసిన మార్గదర్శకాల్లోనూ ఈ అంశాన్ని స్పష్టంగా పేర్కొన్నారు. ఈ రకమైన ఒప్పందాలతో తీసుకున్న రుణాలను సాంకేతికంగా సెల్ఫ్ హెల్ప్ గ్రూప్(ఎస్‌హెచ్‌జీ) మాదిరిగానే పరిగణిస్తుంటారు.
కానీ బ్యాంకులు, వ్యవసాయాధికారులు మాత్రం రుణమాఫీ కింద వీటిని పరిగణించడం ఏమిటం టూ పలువురు ప్రశ్నిస్తున్నారు. రైతుల ఫోన్లకు రుణమాఫీ మెస్సేజ్‌లు రాకపోయి ఉంటే ఈ తతంగం చాటున రుణమాఫీ పేరిట మంజూరైన సొమ్ము అప్పనంగా పక్కదారి పట్టి ఉండేది కదా? అన్న చర్చ జరుగుతున్నది. ప్రభుత్వ సొమ్మును పక్కదారి పట్టించేందుకు ఎవరైనా ఇందులో భాగస్వామ్యమై ఉన్నారా? అనే కోణంలో విచారిస్తే పూర్తి వివరాలు తెలిసే అవకాశాలు లేకపోలేదు. వ్యవసాయ శాఖ ఉన్నతాధికారులను ఈ విషయంపై వివరాలు అడిగితే స్పందించేందుకు ముఖం చాటేస్తున్నారు.
కనిపించని పారదర్శకత..
గాయత్రీ షుగర్ ఫ్యాక్టరీస్, రైతులు, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మధ్య ట్రైపార్టీ అగ్రిమెంట్ అన్నది 20ఏండ్ల నుంచి కొనసాగుతున్నది. ఇందులో రైతుల పాత్ర సూక్ష్మమే. పత్రాలపై సంతకాలతోనే సరిపెడుతా రు. కానీ ప్రధానంగా బ్యాంకు, షుగర్ ఫ్యాక్టరీ మధ్య ఒప్పందం అధికారికంగా జరుగుతుంది. ఈ విషయం సగానికి ఎక్కువ మంది రైతులకు తెలియదు. ట్రైపార్టీ అగ్రిమెంట్ ఆధారంగా చేసుకొని యూనియన్ బ్యాంకు నుంచి షుగర్ ఫ్యాక్టరీ రుణాలను తీసుకున్నది.
ఇందులో ఫ్యాక్టరీ ఆస్తులను పూచీకత్తుగా యూనియన్ బ్యాంకు పరిగణలోకి తీసుకున్నది. ఈ ఒప్పందాల్లో రుణాల అంశం రైతులకు ఎవ్వరికీ తెలియకపోవడం ఇందులో దాగి ఉన్న రహస్యం. ఇరవై ఏండ్ల నుంచి రుణాలు తీసుకుంటున్నామని యాజమాన్యం బుధవారం ప్రకటించింది. కానీ గతంలో ఎప్పుడూ ఈ విషయం పై రైతులకు సమాచారమే ఇవ్వలేదు. గాయత్రీ షుగర్ ఫ్యాక్టరీ పరిధిలో రైతులకు జరిగిన మోసంపై కాంగ్రెస్ పార్టీకి చెందిన స్థానిక ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు కనీసం పెదవి విప్పలేదు. అసెంబ్లీ సమావేశాల నిమిత్తం హైదరాబాద్‌లో ఉన్నప్పటికీ సొంత నియోజకవర్గంలో జరిగిన తంతుపై స్పందించకపోవడంపై రైతులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
కదిలించిన ‘నమస్తే తెలంగాణ’ కథనం..
చెరుకు సాగుకు తప్ప రుణాల విషయంలో రైతులెవ్వరూ గాయత్రీ ఫ్యాక్టరీకి ఎలాంటి ఒప్పందాలను రాసివ్వరు. కానీ ఇదే అదనుగా భావించి రూ.కోట్లలో రుణాలను ఫ్యాక్టరీ సేకరిస్తుండడం మొదటిసారి బయటపడింది. ఇందులో రుణమాఫీ పరిధిలోని రుణాలు కూడా ఉండడంతో రైతులంతా లబోదిబోమనగా “నమస్తే తెలంగాణ” అండగా నిలిచింది. రైతులతో మాట్లాడి వారి వేదనను అక్షరరూపంలో పెట్టగా ఈ నెల 24న బుధవారం రైతు చేయని రుణాలూ మాఫీ, ఒప్పందాల పేరిట దారుణం… అనే శీర్షికతో మెయిన్, జిల్లా సంచికలో కథనాలను ప్రచురించింది. ఈ కథనాలు రైతులకు చేరడంతోపాటు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ కథనాలపై స్పందించిన రాష్ట్ర ప్రభుత్వం వివరాలను ఆరా తీసింది. సంబంధీకులపై సీరియస్ కావడంతో గాయత్రీ షుగర్స్ యాజమాన్యం దిగొచ్చింది.
విచారణకు కమిటీని వేశాం…
“నమస్తే తెలంగాణ” దినపత్రికలో వచ్చిన కథనం ఆధారంగా గాయత్రీ షుగర్ ఫ్యాక్టరీ పరిధిలో అనర్హులకు రుణమాఫీకి సంబంధించిన అంశంపై విచారణకు ఆదేశాలు జారీ చేశాం. ఆర్డీవో, జిల్లా వ్యవసాయాధికారులకు ఈ బాధ్యతలను అప్పగించాను. రెండు రోజుల్లోనే విచారణ నివేదిక వస్తుంది. ఆ తర్వాత అధికారికంగా పూర్తి వివరాలు వెల్లడిస్తాం.
– ఆశీష్ సంగ్వాన్, కలెక్టర్, కామారెడ్డి
Read Today's Latest Nizamabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
NTR | నెల్సన్ దర్శకత్వంలో రాక్..? ఎన్టీఆర్‌ను కలిసి కథ చెప్పిన నెల్సన్ దిలీప్‌కుమార్
India Protests | భారత్‌లో విద్యార్థి నిరసనల అణచివేతపై ప్రశ్నించండి.. 13 కోట్ల మంది ఓటర్ల తొలగింపు ఆందోళనకరం
MK Stalin | ‘వెన్నుపోటు’ కాంగ్రెస్‌తో కలిసి పనిచేయం.. సీజేపీ నిరసనలకు స్టాలిన్ మద్దతు
Supreme Court | పనులు చేయకుంటే మేమే ధర్నాకు దిగుతాం.. కేంద్ర ప్రభుత్వంపై సుప్రీంకోర్టు ఆగ్రహం
Greater Noida | గ్రేటర్ నోయిడాలో ఘోర విషాదం.. ఐదుగురి ప్రాణం తీసిన నూడుల్స్, టీ!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

