ముర్రుపాలు అమృత తుల్యం
బిడ్డకు అమ్మ పాలు వరం.. సురక్షితం.. పౌష్టికాహారం.. అన్ని పోషకాలు అందించి రోగాల నుంచి రక్షించే అమృతం. పోతపాల కన్నా తల్లిపాలు తాగే పిల్లలు బలంగా, తెలివిగా ఉంటారన్నది నిరూపితమైన వాస్తవం. శిశువు సంపూర్ణ ఆరోగ్యంతో, వజ్ర సమానమైన రోగనిరోధక శక్తిని పొందాలంటే తల్లిపాలు పట్టించాల్సిందే. తల్లిపాలతో తల్లీబిడ్డకు లాభాలున్నాయి. ఎన్నో రకాల వ్యాధుల నివారణకు దోహదపడుతాయి
- బిడ్డ ఆరోగ్యానికి రక్ష
- తల్లిపాలతో వ్యాధి నిరోధకశక్తి
- పుట్టిన అర గంటలోపు పట్టిస్తే అనేక ప్రయోజనాలు
- 7వ తేదీ వరకు తల్లిపాల వారోత్సవాలు
కోటగిరి ఆగస్టు 3: బిడ్డకు అమ్మ పాలు వరం.. సురక్షితం.. పౌష్టికాహారం.. అన్ని పోషకాలు అందించి రోగాల నుంచి రక్షించే అమృతం. పోతపాల కన్నా తల్లిపాలు తాగే పిల్లలు బలంగా, తెలివిగా ఉంటారన్నది నిరూపితమైన వాస్తవం. శిశువు సంపూర్ణ ఆరోగ్యంతో, వజ్ర సమానమైన రోగనిరోధక శక్తిని పొందాలంటే తల్లిపాలు పట్టించాల్సిందే. తల్లిపాలతో తల్లీబిడ్డకు లాభాలున్నాయి. ఎన్నో రకాల వ్యాధుల నివారణకు దోహదపడుతాయి. ఇంతటి విశిష్ఠత కలిగిన తల్లిపాలను బిడ్డ ఎంత వయస్సు వచ్చే వరకు ఇవ్వాలి. రోజుకు ఎన్నిసార్లు పట్టాలి? ఎలా పట్టాలి? తల్లిపాలు పుష్కలంగా రావాలంటే ఏమి తినాలి? ముర్రు పాలు ఎప్పుడు పట్టాలి? ఇలా చాలా అంశాలపై అందరికీ అవగాహన ఉండదు.
ఆధునిక కాలం అమ్మలకు మరింత తక్కువ.. ఇలాంటి అంశాలను వారికి తెలియజేస్తూ, తల్లిపాల ప్రాముఖ్యతను వివరించేందుకు ఐసీడీఎస్ ఆధ్వర్యంలో ఆగస్టు 1నుంచి 7వ తేదీ వరకు తల్లిపాల వారోత్సవాలు నిర్వహిస్తున్నారు. బిడ్డ పుట్టిన గంటలోపు నుంచి 6 నెలల వరకు తల్లిపాలు తప్ప మరే పదార్థాలు ఇవ్వకూడదు. తల్లిపాలు తేలికగా జీర్ణమవుతాయి. అంతే కాకుండా శుభ్రంగా ఎలాంటి క్రీములు లేకుండా ఉంటాయి. శ్వాసకోశ, అలర్జీ, ఆస్తమా, చర్మవ్యాధుల నుంచి పిల్లలను రక్షిస్తాయి. బిడ్డ మానసిక, శారీరక వికాసానికి అవసరమైన పోషకాలు అందిస్తాయి. రోజులో బిడ్డకు 8-10 సార్లు పాలు ఇవ్వాలి. ఆరు మాసాల తర్వాత బిడ్డకు తల్లిపాలతోపాటు అనుబంధ ఆహారం ఇవ్వాలి. రెండేండ్ల వరకు క్రమం తప్పకుండా పాలు పట్టాలి. దీంతో ఎలాంటి వ్యాధులు దరిచేరకుండా బిడ్డ ఎదుగుదల సక్రమంగా ఉంటుంది.
తల్లిపాలతో కలిగే లాభాలు..
- తల్లిపాలు శిశువుకు సంపూర్ణమైన సంతులిత ఆహారం అందుతుంది.
- బిడ్డ మెదడు వికాసానికి తోడ్పడుతాయి.
- బిడ్డలకు అవసరమయ్యే విటమిన్లు పుష్కలంగా ఉంటాయి.
- లాక్టోజ్‌తో కాల్షియం నిల్వలు పెరుగుతాయి. బిడ్డను రక్తహీనత నుంచి కాపాడుతాయి.
- తొలి నెలలో శిశువులకు అంటువ్యాధులు రాకుండా చూస్తాయి.
- డయేరియా, నిమోనియా వంటి ప్రాణాంతక వ్యాధుల నుంచి కాపాడుకోవచ్చు. క్యాన్సర్, చెవికి సంబంధించిన వ్యాధులు, గుండె జబ్బులు వంటి వ్యాధుల నుంచి రక్షణ కల్పిస్తాయి.
- ఎలర్జీ, ఆస్తమా, డయాబెటీస్ వంటి వ్యాధులు రావు.
- బాల్యం, యవ్వనంలో ఊబకాయం వచ్చే ప్రమాదం తక్కువ.
ముర్రుపాలు తప్పనిసరి
బిడ్డ పుట్టిన మొదటి అరగంటలోపు తల్లులకు వచ్చే పాలను ముర్రుపాలు అంటారు. ఇవి రోగనిరోధక శక్తిని పెంచడమే కాకుండా బిడ్డకు సమతుల్యమైన పోషకాహార పదార్థాలు అందజేస్తాయి. ఇందులో మాంసకృత్తులు, విటమిన్”ఏ’ ఉంటుంది.
- వ్యాధులు రాకుండా ముర్రుపాలు బిడ్డను జీవితకాలం కాపాడుతాయి.
- శిశువు పేగులను శుభ్రం చేసి, మొదటి మలవిసర్జనకు తోడ్పడుతాయి.
- తల్లులు సహజంగా బిడ్డకు సరిపడా పాలు రావడం లేదని అనుకోవడం అపోహ మాత్రమే.
- బిడ్డ పుట్టగానే మూడు, నాలుగు రోజుల వరకు పాలు పడవని, తేనె నాకించడం, పంచదార నీళ్లు ఇవ్వడం, గ్లూకోజ్ నీళ్లు ఇవ్వడం చేయొద్దు.
తల్లికి కలిగే లాభాలు..
- తల్లులు చనుబాలు ఇవ్వడంతో గర్భధారణ తర్వాత రక్తస్రావ ప్రమాదం తగ్గడంతోపాటు త్వరగా కోలుకుంటారు. జీవితాంతం ఆరోగ్యంగా ఉంటారు.
- చనుబాలు ఇవ్వడంతో ఊబకాయం వచ్చే ప్రమాదం తగ్గుతుంది. గర్భానికి పూర్వం ఉన్న బరువును తిరిగి పొందగలుతారు.
- బిడ్డకు పాలు పట్టించడంతో రొమ్ము, గర్భసంచి క్యాన్సర్ రావు.
- తల్లులకు మలి వయసులో వచ్చే అస్టియో పొరాసిన్(ఎముకల బలహీనత) నుంచి కాపాడుతుంది.
- తల్లి, శిశువుల మధ్య బంధాన్ని పెంపొందిస్తుంది.
- ఆరు నెలల వరకు రోజుకు 8 నుంచి 10 సార్లు పాలు ఇవ్వాలి.
- తల్లికి, శిశువుకు జ్వరం వచ్చినప్పుడు, టీకాలు ఇచ్చినప్పుడు కూడా పాలు పట్టించవచ్చు.
ఎంతో శ్రేష్ఠమైనవి
ఏటా తల్లిపాల వారోత్సవాలను ఆగస్టు మొదటి వారంలో నిర్వహిస్తాం. గర్భిణులు, బాలింతలకు అవగాహన కల్పిస్తున్నాం. ర్యాలీలు నిర్వహించి తల్లిపాల ప్రాముఖ్యతను వివరిస్తున్నాం.
– ఝాన్సీరాణి, జిల్లా శిశు సంక్షేమ శాఖ అధికారిణి, నిజామాబాద్
తల్లిపాలే తొలి ఆరోగ్య టీకా
బిడ్డ పుట్టిన గంటలోపే తల్లిపాలు పట్టాలి. ముర్రుపాలు తొలి టీకాగా పని చేస్తాయి. బిడ్డకు పాలు పట్టడంతో తల్లికి రొమ్ము క్యాన్సర్, ఇన్ఫెక్షన్ రాకుండా నివారించవచ్చు. తల్లిపాలు సంజీవనిలా పనిచేస్తాయి. తల్లిపాల ఆవశ్యకతను ప్రతి తల్లీ తెలుసుకోవాలి.
– కృష్ణవేణి, హెల్త్ సూపర్వైజర్,పొతంగల్
Read Today's Latest Nizamabad News in Telugu and Telugu News
- Tags
- baby birth
- elixir
- Health
- Infant
RELATED ARTICLES
తాజా వార్తలు
Bhargav Desh Pande | రేవంత్ రెడ్డి చుట్టున్న నలుగురు తప్ప ఎవరూ బాగుపడలేదు : మాజీ NSUI స్టేట్ ప్రెసిడెంట్ భార్గవ్ దేశ్ పాండే
KAAKA | చిరంజీవి ‘కాకా’లో బాలీవుడ్ స్టార్ హీరో .. కీలక పాత్రపై ఆసక్తికర చర్చ!
Mann Ki Baat | ‘మన్ కీ బాత్’ కు 12 ఏళ్లు పూర్తి.. అదొక తీర్థయాత్ర లాంటిదన్న ప్రధాని మోదీ..!
Alias Rukmini | నితిన్ ‘అలియాస్ రుక్మిణి’ నుంచి ఫస్ట్ సింగిల్ అప్డేట్!
Rapido Driver | కానిస్టేబుల్ చెవిని కొరికిన ర్యాపిడో డ్రైవర్.. వీడియో
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

