హామీలు అమలు చేయాలని ఆందోళన
ఎన్నికల సమయంలో మధ్యాహ్న భోజన కార్మికులకు ఇచ్చిన హామీలను సీఎం రేవంత్రెడ్డి అమలుచేయాలని తెలంగాణ మధ్యాహ్న భోజన వర్కర్స్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి తోపునూరు చక్రపాణి డిమాండ్ చేశారు. ఈ మేరకు భీమ్గల్ మండల కేంద్రంలో యూనియన్ నాయకులతో కలిసి ఎంఈవో, ఎంపీడీవో కార్యాలయాల ఎదుట శనివారం ధర్నా చేపట్టారు. అనంతరం ఆయా కార్యాలయాల్లో అధికారులకు వినతిపత్రాలు అందజేశారు.
- భీమ్గల్లో ఎంఈవో, ఎంపీడీవో ఆఫీస్ల ఎదుట మధ్యాహ్న భోజన కార్మికుల ధర్నా
భీమ్గల్, జూన్ 27: ఎన్నికల సమయంలో మధ్యాహ్న భోజన కార్మికులకు ఇచ్చిన హామీలను సీఎం రేవంత్రెడ్డి అమలుచేయాలని తెలంగాణ మధ్యాహ్న భోజన వర్కర్స్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి తోపునూరు చక్రపాణి డిమాండ్ చేశారు. ఈ మేరకు భీమ్గల్ మండల కేంద్రంలో యూనియన్ నాయకులతో కలిసి ఎంఈవో, ఎంపీడీవో కార్యాలయాల ఎదుట శనివారం ధర్నా చేపట్టారు. అనంతరం ఆయా కార్యాలయాల్లో అధికారులకు వినతిపత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా యూనియన్ నాయకులు మాట్లాడుతూ ప్రభుత్వం సెంట్రలైజ్డ్ కిచెన్ విధానాన్ని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు.
కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ ప్రకారం కార్మికులకు నెలకు రూ. 10 వేల వేతనం, పీఎఫ్, ఈఎస్ఐ సౌకర్యం కల్పించాలని కోరారు.రిటైర్మెంట్ బెనిఫిట్ కింద రూ. 2 లక్షల ఎక్స్గ్రేషియా ఇవ్వాలని, కార్మికులు చనిపోతే అంత్యక్రియల ఖర్చులు చెల్లించాలని కోరారు. నిత్యావసర వస్తువులు, సరుకులతోపాటు గ్యాస్, కోడిగుడ్లు ప్రభుత్వమే సరఫరా చేయాలన్నారు. ప్రభుత్వం తక్షణమే తమ డిమాండ్లను నెరవేర్చాలని, లేనిపక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో మధ్యాహ్న భోజన వర్కర్స్ యూనియన్ మండల బాధ్యులు చిన్నూబాయ్, స్వప్న, లలిత, రమా, మంజుల, గోవింద్, బుచ్చవ్వ, ప్రమీల తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Nizamabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kodangal | కొడంగల్ ఎడ్యుకేషన్ హబ్లో వలస కూలీల తిరుగుబాటు.. నిర్మాణ సంస్థపై తీవ్ర ఆరోపణలు
Miss behave | బాలికకు బొమ్మలిస్తానని నమ్మించి అసభ్య ప్రవర్తన
Collector Kumar Deepak | ప్రభుత్వ భూములు కాపాడేందుకు చర్యలు చేపట్టాలి : జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్
మహిళపై లైంగిక వేధింపులు.. వ్యక్తికి మూడేళ్ల జైలు శిక్ష
సర్పంచ్ సంతకం లేకుండానే ఇందిరమ్మ ఇళ్ల మంజూరు
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

