Theft | తాళం వెసి ఉన్న ఇంట్లో భారీ చోరీ.. రూ.10లక్షలు, 10 తులాల బంగారం చోరీ
నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ఓ తాళం వేసిన ఇంటిని టార్గెట్ చేసిన దుండగులు భారీ చోరీకి పాల్పడ్డాను. ఇంట్లో ఎవరు లేని సమయంలో దుండగులు ఇంటి కిటికీ గ్రిల్ ను తొలగించి లోనికి దూకారు. నిజామాబాద్ నగరంలోని 5 వటౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ దోపిడీ జరిగింది.
- కిటికీ గ్రిల్స్ తొలగించి లోనికి దూకిన దుండగులు
- అంతర్ రాష్ట్ర దోపిడీ ముఠాగా అనుమానాలు
- దర్యాప్తులోకి రంగంలోకి దిగిన సీసీఎస్ బృందం
Theft | వినాయక్ నగర్, సెప్టెంబర్, 18 : నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ఓ తాళం వేసిన ఇంటిని టార్గెట్ చేసిన దుండగులు భారీ చోరీకి పాల్పడ్డాను. ఇంట్లో ఎవరు లేని సమయంలో దుండగులు ఇంటి కిటికీ గ్రిల్ ను తొలగించి లోనికి దూకారు. నిజామాబాద్ నగరంలోని 5 వటౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ దోపిడీ జరిగింది. స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం.. నగర శివారులోని బాబన్ సహాడ్ ప్రాంతంలో నివాసముండే నిషాత్ ఆఫ్రిన్ అనే మహిళ అర్సపల్లిలోని తమ బంధువుల ఇంట్లో ఫంక్షన్ ఉండడంతో బుధవారం ఇంటికి తాళం వేసి అక్కడికి వెళ్ళింది.
గురువారం ఉదయం వారు ఇంటికి తిరిగి వచ్చేసరికి ఇంట్లోని బీరువా ధ్వంసం చేసి వస్తువులన్నీ చిందరవందరగా పడి ఉన్నాయి. దీంతో అనుమానం వచ్చి పోలీసులకు సమాచారమిచ్చారు. దీంతో ఘటన స్థలాన్ని పరిశీలించగా దుండగులు ఇంటి కిటికీ గ్రిల్స్ స్క్రూ డ్రైవర్‌తో తొలగించి లోనికి ప్రవేశించి దోపిడీకి పాల్పడిన ఆనవాళ్లను పోలీసులు గుర్తించారు. ఈ చోరీలో సుమారు రూ.పది లక్షల వరకు విదేశీ కరెన్సీ తో పాటు పది తులాలు బంగారం దోపిడీకి గురైనట్లు బాధితులు తెలిపారు. విషయం తెలియడంతో ఇది స్థానికుల దొంగల పని కాదని కిటికీ గ్రిల్ తొలగించి దోపిడీకి పాల్పడేది మహారాష్ట్ర ప్రాంతానికి చెందిన ముఠా దోపిడీ చేసిందని పలు అనుమానాలు వ్యక్తం చేశారు.
విషయం తెలియడంతో సీసీఎస్ ఎసీపీ నాగేంద్ర చారి ఘటనా స్థలానికి వెళ్లి దోపిడీ జరిగిన తీరును పరిశీలించారు. సహజంగా కిటికీ గ్రిల్ తొలగించి దోపిడీలకు పాల్పడేది అంతర్రాష్ట్ర ముఠాపనేనని ఏసీపీ అనుమానాలు వ్యక్తం చేశారు. దోపిడీ ముఠా ను త్వరలోనే పట్టుకుంటామని ఆయన పేర్కొన్నారు. ఘటన స్థలానికి ఐదో టౌన్ ఎస్ఐ గంగాధర్ తోపాటు క్లూస్ టీం చేరుకొని ఆధారాలు సేకరించారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు నిర్వహిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ముందుగా 20 తులాల బంగారం చోరీ అయినట్లు బాధితులు తెలిపినప్పటికీ ఇంట్లోనీ ఓ గదిలో బంగారు బిస్కెట్ ఇంటి యజమానికి దొరికినట్లుగా పోలీసులు తెలిపారు.
Read Today's Latest Nizamabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Chapri | స్లమ్ కుర్రాడి ప్రేమ కథా చిత్రంగా సరోజ్ కుమార్ ‘ఛప్రి’.. ఆకట్టుకుంటున్న ఫస్ట్ లుక్!
Madarasi Rabbaru Bomma | ‘టైసన్ నాయుడు’ నుంచి ఫస్ట్ సింగిల్ ‘మదరాసి రబ్బరు బొమ్మ’ విడుదల
AnaswaraRajan | ‘ఇట్లు అర్జున’ లో కీర్తి పాత్ర ప్రతి అమ్మాయికి కనెక్ట్ అవుతుంది: అనస్వర రాజన్
చందమామ అందానికి ఫిదా అవ్వాల్సిందే.. బ్లాక్ డ్రెస్‌లో కాజల్ హాట్ ఫొటోలు వైరల్!
Man Catches Employee With Daughter | ఇంట్లో కుమార్తెతో కలిసి ఉన్న ఉద్యోగి.. బ్యాట్‌తో కొట్టి చంపిన యజమాని
ట్రెండింగ్ వార్తలు
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!

