జిగేల్.. జిగేల్
విశాలమైన రోడ్లు.. డివైడర్లు.. సెంట్రల్ లైటింగ్.. ఇవి ఒకప్పుడు పట్టణాలకే పరిమితం. ప్రస్తుతం మండల కేంద్రాలు సైతం పట్టణాలకు తీసిపోని విధంగా రూపాంతరం చెందుతున్నాయి.మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి కృషితో.. రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో ఒక్క బాల్కొండ నియోజకవర్గంలోని ఎనిమిదిమండలాల్లో రోడ్ల విస్తరణ, డివైడర్ల నిర్మాణం, సెంట్రల్ లైటింగ్ ఏర్పాటుకు రూ.57.19 కోట్లు మంజూరయ్యాయి.
- నాడు చిమ్మచీకట్లు.. నేడు సరికొత్త వెలుగులు
- రోడ్ల విస్తరణ, డివైడర్లతో సెంట్రల్ లైటింగ్
- బాల్కొండ నియోజకవర్గంలో పట్టణాలను తలపిస్తున్న మండల కేంద్రాలు
- రూ.57.19కోట్లతో సుందరీకరణ పనులు
విశాలమైన రోడ్లు.. డివైడర్లు.. సెంట్రల్ లైటింగ్.. ఇవి ఒకప్పుడు పట్టణాలకే పరిమితం. ప్రస్తుతం మండల కేంద్రాలు సైతం పట్టణాలకు తీసిపోని విధంగా రూపాంతరం చెందుతున్నాయి.మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి కృషితో.. రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో ఒక్క బాల్కొండ నియోజకవర్గంలోని ఎనిమిదిమండలాల్లో రోడ్ల విస్తరణ, డివైడర్ల నిర్మాణం, సెంట్రల్ లైటింగ్ ఏర్పాటుకు రూ.57.19 కోట్లు మంజూరయ్యాయి. నాలుగు మండలాల్లో పనులు పూర్తికాగా రెండు మండలాల్లో ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉన్నాయి.
మోర్తాడ్, ఏప్రిల్ 13: రాత్రుల్లో చిమ్మచీకట్లలో రోడ్లు ఇది గతం. పట్టణాలను తలపించేలా వెలుగుల్లో మండల కేంద్రాలు ఇది నేటి దృశ్యం. రోడ్ల విస్తరణతోపాటు డివైడర్లను నిర్మించి సెంట్రల్‌లైటింగ్‌ను ఏర్పాటు చేయడంతో బాల్కొండ నియోజకవర్గంలోని మండల కేంద్రాలు పట్టణాలను తలపిస్తున్నాయి. రాత్రుల్లో సెంట్రల్లైటింగ్తో మిరుమిట్లు గొలిపే వెలుతురులు మండల కేంద్రాలకు కొత్తకళను తీసుకువచ్చాయి. ప్రతి మండల కేంద్రాన్ని పట్టణంలా తీర్చిదిద్దిన మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డికి నియోజకవర్గ ప్రజలు కృతజ్ఞతలు తెలుపుతున్నారు.
రూ.57.19కోట్లు మంజూరు
నియోజకవర్గంలోని ఎనిమిది మండలాల్లో రోడ్ల విస్తరణ, డివైడర్ల నిర్మాణం, సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు కోసం రూ.57.19కోట్లు మంజూరయ్యాయి. ఇందులో మోర్తాడ్‌కు రూ.8కోట్లు, భీమ్‌గల్‌కు రూ.17.19కోట్లు, ఏర్గట్ల, ముప్కాల్, వేల్పూర్లకు రూ.5కోట్ల చొప్పున, కమ్మర్‌పల్లికి రూ.5.5కోట్లు, బాల్కొండకు రూ.9కోట్లు, మెండోరాకు రూ.2.50కోట్లు మంజూరవ్వగా, ఇందులో మోర్తాడ్, భీమ్‌గల్, వేల్పూర్, బాల్కొండ మండల కేంద్రాల్లో పనులు పూర్తయి ప్రారంభోత్సవం కూడా జరిగింది. కమ్మర్‌పల్లిలో పనులు పూర్తయి ప్రారంభానికి సిద్ధంగా ఉన్నది. ముప్కాల్, ఏర్గట్ల మండల కేంద్రాల్లో పనులు కొనసాగుతుండగా, మెండోరాలో ప్రారంభం కావాల్సి ఉన్నది. మండల కేంద్రాలకు సెంట్రల్ లైటింగ్ సౌకర్యం కలుగుతుందని ఎవరు కలలో కూడా ఊహించనిది. సెంట్రల్ లైటింగ్‌తో కొత్తవెలుగులు రావడంతో ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
సెంట్రల్ లైటింగ్ వస్తదని అనుకోలేం
మోర్తాడ్‌కు సెంట్రల్ లైటింగ్ వస్తదని అనుకోలేం. కలలో కూడా ఊహించలేం. అటువంటి పని మంత్రిగారు చేయించారు. మోర్తాడ్‌కు కొత్తవెలుగులు నింపిన మంత్రికి రుణపడి ఉంటాం. జాతీయ రహదారిపైనే కాకుండా గ్రామంలో కూడా సెంట్రల్‌లైటింగ్ ఏర్పాటు చేయడంతో గ్రామస్వరూపమే మారింది. బస్టాండ్ నుంచి గ్రామం వరకు గతంలో చీకట్లలో రావాల్సి వచ్చేది. ఇప్పుడు బస్టాండ్ నుంచి గ్రామం వరకు సెంట్రల్ లైటింగ్ వెలుగుల మధ్య వస్తుండడం ఆనందంగా ఉన్నది.
– జేసీ గంగారెడ్డి, గ్రామాభివృద్ధి కమిటీ అధ్యక్షుడు, మోర్తాడ్
ఇది మోర్తాడేనా అని ఆశ్చర్యపడుతున్నారు
కొత్తగా వచ్చిన వారు ఇది మోర్తాడేనా అని అడుగుతున్నారంటే మండల కేంద్రానికి ఎంత కళ వచ్చిందో అర్థమవుతుంది. రాత్రుల్లో కొత్త వెలుగులతో నిండిపోవడంతో ప్రజలంతా ఆనందం వ్యక్తంచేస్తున్నారు. మోర్తాడ్‌లో జాతీయ రహదారితోపాటు గ్రామంలోకి సెంట్రల్‌లైటింగ్ ఏర్పాటు చేయడంతో వాహనదారులకు చీకట్లలో ప్రయాణించే బాధ తప్పింది. రోడ్డు విస్తరణ, డివైడర్ల నిర్మాణంతో ప్రమాదాలు తగ్గాయి. మోర్తాడ్ను పట్టణంలా తీర్చిదిద్దిన మంత్రి సహకారాన్ని మరచిపోలేం.
– బోగ ధరణి, సర్పంచ్, మోర్తాడ్
Read Today's Latest Nizamabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

