KTR | ఆర్మూరు : ఆదిలాబాద్ కు వెళ్తున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కు ఆర్మూర్ పట్టణంలోని హైవే వద్ద బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ఆధ్వర్యంలో పలువురు నాయకులు మంగళవారం ఘనస్వాగతం పలికారు.
ఈ సందర్భంగా కేటీఆర్ కు పూలమాలలు వేసి శాలువాలతో ఘనంగా సన్మానించారు. ఆర్మూర్ కు కేటీఆర్ రావడంతో బీఆర్ఎస్ నాయకులు పూలమాలు, శాలువాలతో సన్మానిస్తూ ఫొటోలను తీసుకున్నారు.