చిన్నారులకు స్కేటింగ్లో శిక్షణ
జిల్లా యువజన క్రీడల శాఖ ఆధ్వర్యంలో వేసవి శిక్షణ శిబిరం నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా చిన్నారులకు వివిధ అంశాల్లో శిక్షణ ఇస్తున్నారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని డీఎస్ఏ మైదానంలో స్కేటింగ్లో శిక్షణ ఇస్తుండడంతో చిన్నారులు ఉత్సాహంగా పాల్గొంటున్నారు. చిన్న వయసులోనే స్కేటింగ్లో దూసుకుపోతున్నారు. నాలుగేండ్ల వయస్సు ఉన్న చిన్నారులు సైతం స్కేటింగ్లో ప్రతిభ చూపిస్తున్నారు.
–స్టాఫ్ ఫొటోగ్రాఫర్, నిజామాబాద్