ఆర్మూర్‌టౌన్, జూలై 28: కేసీఆర్ ప్రభుత్వ హయాంలోనే ఆర్మూర్ అభివృద్ధి చెందినట్లు మాజీ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్‌రెడ్డి తెలిపారు. జనతా గ్యారేజీలో భాగంగా ఆయన మంగళవారం పట్టణంలోని జమ్మన్ జట్టి కాలనీలో పర్యటించారు. మురికి కాలువలు, స్పీడ్ బ్రేకర్లను పరిశీలించారు. ఈ సందర్భంగా జీవన్‌రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలోనే ఆర్మూర్ పూర్తిస్థాయిలో అభివృద్ధి చెందినట్లు తెలిపారు. కాలనీవాసులు తమ సొంత ఖర్చులతో ఏర్పాటు చేసుకున్న స్పీడ్ బ్రేకర్లను తొలగించారని తెలిపారు. డ్రైనేజీలపై పైకప్పులు ఏర్పాటు చేయాలని, దోమల నివారణకు సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు. స్థానిక బీఆర్ఎస్ నాయకులు ఉన్నారు.
ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణ (సర్)లో భాగంగా ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్‌రెడ్డి తన ఎన్యూమరేషన్ ఫారాన్ని పూర్తిచేసి, మంగళవారం సంబంధిత అధికారులకు అందజేశారు. అర్హులైన ఓటర్లందరూ తమకు ఇచ్చిన ఎన్యూమరేషన్ ఫారాలను బీఎల్వోలకు అందించాలని ఈ సందర్భంగా జీవన్‌రెడ్డి కోరారు.
-ఆర్మూర్‌టౌన్, జూలై 28