కండ్ల కలకలం.. టెన్షన్ వద్దు..
సర్వేంద్రియానాం నయనం ప్రధానం. మనిషికి శరీరంలో కండ్లు కూడా ముఖ్యమైనవి. కండ్లు బాగుంటేనే ప్రపంచాన్ని చూడగలుగుతాము. లేకపోతే అంధకారమే. జిల్లాలో గత పది రోజుల నుంచి వర్షాలు కురవడంతో వాతావరణంలో వచ్చిన మార్పులతో కండ్ల కలక వ్యాధి విస్తరిస్తున్నది.
- ప్రభుత్వ దవాఖానల్లో అందుబాటులో మందులు
- రోజురోజుకూ విస్తరిస్తున్న వైరస్
- సొంత వైద్యం జోలికి వెళ్లొద్దు
- భౌతికదూరం శ్రేయస్కరం
సర్వేంద్రియానాం నయనం ప్రధానం. మనిషికి శరీరంలో కండ్లు కూడా ముఖ్యమైనవి. కండ్లు బాగుంటేనే ప్రపంచాన్ని చూడగలుగుతాము. లేకపోతే అంధకారమే. జిల్లాలో గత పది రోజుల నుంచి వర్షాలు కురవడంతో వాతావరణంలో వచ్చిన మార్పులతో కండ్ల కలక వ్యాధి విస్తరిస్తున్నది. చిన్నపిల్లలు, పెద్దవారు అనే తేడా లేకుండా కండ్ల కలక సమస్యతో బాధపడుతున్నారు. కండ్ల కలకను పింక్ అంటారు. కండ్ల కలక ఒకరి నుంచి మరొకరికి సోకే ప్రమాదం ఉంటుందని, రద్దీ ప్రదేశాల్లో చాలా సులభంగా వ్యాప్తి చెందే అవకాశముంటుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. సరైన జాగ్రత్తలు పాటించడంతోపాటు కండ్ల కలక సోకితే సమీపంలోని ప్రభుత్వ దవాఖానలో చికిత్స పొందాలని సూచిస్తున్నారు.
బ్యాక్టీరియా, వైరస్‌తో వ్యాప్తి ఎక్కువ..
కంటి గుడ్డు చుట్టూ ఉండే తెల్లని పొర, కంటి రెప్ప ల వెనుక ఉండే పొరను కంజెటైవా అంటారు. కండ్లు తెరచి ఉండడంతో దుమ్ము, ధూళి, వేడి, చలి, నీళ్లు ఏదైనా ప్రభావం చూపిస్తాయి. దీంతో ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఉంటుంది. దీనినే కండ్ల కలక అంటారు. ఈ ఇన్ఫెక్షన్ బ్యాక్టీరియా, వైరస్‌తో ఎక్కువగా వ్యాప్తి చెందుతుంది. ఇది చిన్నపాటి ఇన్ఫెక్షన్గా అనిపించినా రోజూవారీ పనులు చేసుకోకుండా, ఇంట్లో నుంచి బయటికి రాకుండా చేస్తుంది. వానకాలంలో మురికి, కాలుష్యం పెరగడంతో కండ్ల కలక సోకుతుందని వైద్యులు చెబుతున్నారు.
లక్షణాలు
- కండ్లు ఎర్రబారడం, దురద, కంట్లోంచి నీరు కారుతుంది.
- కంటి రెప్పలు ఉబ్బిపోయి, రాత్రి నిద్రపోయినప్పుడు అతుక్కొనిపోతాయి, ఊసులు వస్తాయి.
- సాధారణ కండ్ల కలక వస్తే వారంపాటు ఇబ్బంది పెట్టిన తర్వాత తగ్గిపోతుంది.
- వైరస్‌తో కండ్ల కలక వస్తే మూడు వారాల పాటు ఉండొచ్చు.
తీసుకోవాల్సిన జాగ్రత్తలు
- కండ్ల కలక వ్యాధి ఒకరి నుంచి మరొకరికి సులభంగా వ్యాప్తి చెందే అవకాశమున్న నేపథ్యంలో ప్రజలు జాగ్రత్తలు పాటించాలని వైద్యులు సూచిస్తున్నారు. రద్దీగా ఉండే ప్రదేశాల్లో సంచరించవద్దని, ప్రయాణ సమయంలో ప్రత్యేకంగా జాగ్రత్తలు తీసుకోవాలి.
- చేతులను ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచుకోవాలి. మురికిగా ఉండే చేతులతో కండ్లను తాకొద్దు. దీంతో వైరస్ కండ్లకు వ్యాపిస్తుంది. పబ్లిక్ ప్లేసుల్లో ఎక్కడైనా చేతులతో తాకితే తప్పనిసరిగా హ్యాండ్ శానిటైజర్‌తో చేతులను శుభ్రంగా కడుక్కోవాలి.
- ద్విచక్రవాహనదారులు కండ్లకు సన్ గ్లాసెస్ లేకపోతే సేఫ్టీ గ్లాసెస్‌ను ధరించడం మంచిది. వీటితో గాలిలో ఉండే దుమ్మూ ధూళి నుంచి రక్షణగా ఉండడమే కాకుండా వైరల్ నుంచి కాపాడతాయి.
- కండ్ల కలకతో బాధపడే వారికి దూరంగా ఉండడం శ్రేయస్కరం. వారు వాడిన వస్తువులను తాకొద్దు.
- ఇంట్లో ఒకరికి వస్తే చాలు ఒకటి రెండు రోజుల్లో మిగతా వారందరికీ వ్యాపించే అవకాశం ఉంటుంది. చిన్న పిల్లలకు సులభంగా సోకుతుంది.
నివారణ చర్యలు
- కండ్ల కలక సోకిన వారికి దురదగా అనిపించిన సమయంలో కండ్లపై రుద్దకూడదు.
- తరచూ శుభ్రంగా కండ్లను కడగడంతోపాటు తుడుచుకోవడానికి శుభ్రమైన కాటన్ క్లాత్, టిష్యూ పేపర్ని వాడాలి.
- కండ్ల కలక సోకిన వారు ఇంట్లో ప్రత్యేకంగా ఉండాలి. ఇది సోకినవారు ఇంటి బయటికి రాకుండా ఉండడం మంచిది.
- కండ్ల కలక వచ్చిన సమయంలో వ్యక్తిగత వస్తువులను మరెవ్వరికీ ఇవ్వొద్దు.
- అర్హతగల కంటి వైద్యులను సంప్రదించడంతో వ్యాధి తీవ్రత తగ్గించవచ్చు. కంటి వైద్యుల పర్యవేక్షణలో యాంటీబయాటిక్ ఐ డ్రాప్స్, లూబ్రికెంట్ ఐడ్రాప్స్ మందులు వాడుకోవాలి. సొంత వైద్యం జోలికి పోవద్దు.
కండ్ల కలక అంటువ్యాధి.. చాలా తేలిగ్గా ఒకరి నుంచి మరొకరికి సోకుతుంటుంది. కొన్నిరోజుల నుంచి కండ్ల కలక కేసులు విస్తరిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రజలు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని కంటి వైద్య నిపుణులు సూచిస్తున్నారు. కంట్లో నలక పడినప్పుడు కంటి నుంచి నీరు కారడం, కండ్లు ఎర్రబడటం మామూలే. అయితే కండ్ల కలక బారినపడినప్పుడు కూడా ఇలాంటి బాధలు కనిపిస్తాయి. కండ్లు ఎర్రగా మారిపోయి నీరుకారుతూ ఉంటాయి. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో పలుచోట్ల కండ్ల కలక వ్యాధి లక్షణాలు కనిపిస్తున్నాయి. ఈ సమస్యకు చికిత్సా, మార్గాలపై ‘నమస్తే తెలంగాణ’ ప్రత్యేక కథనం..
– ఖలీల్‌వాడి/ రాజంపేట, జూలై 30
పీహెచ్‌సీల్లో మందులు..
నిజామాబాద్ జిల్లాలో ఇప్పటి వరకు కండ్ల కలక వైరస్ కేసులు నమోదు కాలేదు. ముందు జాగ్రత్త చర్యగా అన్ని పీహెచ్‌సీల్లో మందులు అందుబాటులో ఉంచాం. ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. కండ్లు ఎర్రగా మారి దురద, దద్దుర్లు వస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలి.
– డాక్టర్ సుదర్శనం, డీఎంహెచ్‌వో, నిజామాబాద్
జీజీహెచ్‌లో ప్రత్యేక వార్డులు..
జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ దవాఖానలో కండ్ల కలక వైరస్‌కు సంబంధించిన మందులను అందుబాటులో ఉంచాం. అత్యవసర పరిస్థితుల్లో ఉన్నవారి కోసం ప్రత్యేక వార్డులు ఏర్పాటు చేశాం. కండ్ల కలక వచ్చిన వారు ఆందోళన చెందకూడదు.
– డాక్టర్ ప్రతిమారాజ్, సూపరింటెండెంట్, జీజీహెచ్ నిజామాబాద్
జాగ్రత్తలు పాటించాలి..
కండ్ల కలక వైరస్ వచ్చినా ఎలాంటి ఆందోళన, అపోహలు పెట్టుకోవద్దు. జాగ్రత్తలు పాటిస్తే త్వరగానే నయం అవుతుంది. కండ్ల కలక వచ్చిన వారు శుభ్రమైన టవల్స్‌తో తుడుచుకోవాలి. పరిసరాలను శుభ్రంగా ఉంచుకుంటే ఎలాంటి వైరస్లు దరిచేరవు. వైరస్ సోకిన వారు కండ్లద్దాలు ధరిస్తే ఇతరులకు వ్యాప్తి చెందదు.
– డాక్టర్ సుజాత, కంటి వైద్యనిపుణురాలు
శిబిరాల నిర్వహణకు చర్యలు తీసుకుంటున్నాం..
జిల్లాలో కండ్ల కలక వ్యాధి కేసులు నమోదవుతున్నాయి. భారీ వర్షాలతో వచ్చిన వాతావరణ మార్పులతో కండ్ల కలక వస్తున్నది. కండ్ల కలక వచ్చిన వారు ఐసొలేషన్‌లో ఉండడం ద్వారా వ్యాధి వ్యాప్తిని అరికట్టవచ్చు. కండ్ల కలక వ్యాప్తి నేపథ్యంలో ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నది. వైద్యశాఖ ఆధ్వర్యంలో శిబిరాల నిర్వహణకు చర్యలు తీసుకుంటున్నాం. పాఠశాలలు, హాస్టళ్లలో ఉపాధ్యాయులు తగిన చర్యలు తీసుకోవాలి.
– లక్ష్మణ్ సింగ్, డీఎంహెచ్‌వో, కామారెడ్డి
Read Today's Latest Nizamabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

