సమ్మె సక్సెస్
డిమాండ్ల సాధన కోసం ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మె తొలిరోజు బుధవారం విజయవంతమైంది. ఉమ్మడి జిల్లాలో పని చేస్తున్న డ్రైవర్లు, కండక్టర్లు, కార్మికులు విధులకు దూరంగా ఉన్నారు. దీంతో దాదాపు 90 శాతం బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి.
- విధుల్లోకి రాని ఆర్టీసీ కార్మికులు
- డిపోలు దాటని బస్సులు
- ప్రశాంతంగా సాగిన నిరసనలు
- ప్రయాణికుల అవస్థలు
- దోచుకున్న ప్రైవేట్ వాహనాలు
బోధన్/ఖలీల్‌వాడి/ఎల్లారెడ్డి/ఆర్మూర్, ఏప్రిల్ 22: డిమాండ్ల సాధన కోసం ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మె తొలిరోజు బుధవారం విజయవంతమైంది. ఉమ్మడి జిల్లాలో పని చేస్తున్న డ్రైవర్లు, కండక్టర్లు, కార్మికులు విధులకు దూరంగా ఉన్నారు. దీంతో దాదాపు 90 శాతం బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. మరోవైపు, ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయక పోవడంతో ప్రయాణికులు తీవ్ర అవస్థలు పడ్డారు. ఇక, సమ్మెను అవకాశంగా తీసుకుని ప్రైవేట్ వాహనదారులు ఇష్టానుసారంగా డబ్బులు వసూలు చేశారు.
కార్మికుల నిరసనలు..
డిమాండ్ల సాధన కోసం సర్కారుపై సమరం పూరించిన ఆర్టీసీ కార్మికులు విధులకు దూరంగా ఉన్నారు. ఉదయం నుంచే కార్మికులు డిపోలు, బస్టాండ్ల ఎదుట బైఠాయించారు. నిజామాబాద్ డిపో-1, 2, కామారెడ్డి, ఎల్లారెడ్డి, బాన్సువాడ, బోధన్, ఆర్మూర్ డిపోల నుంచి దాదాపు 90 శాతం బస్సులు బయటకు రాలేదు. నిజామాబాద్ బస్టాండ్, డిపోలలో సమ్మెకు అనుమతి ఇవ్వకపోవడంతో పాత కలెక్టరేట్ మైదానంలో కార్మికులు సమావేశమై, సమ్మె ఆవశ్యకతపై చర్చించారు. ఆర్టీసీ కార్మికుల సమ్మెకు ఏఐటీయూసీ, సీఐటీయూ మద్దతు ప్రకటించాయి. కార్మికుల సమస్యలు పరిష్కరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశాయి. అటు బోధన్ బస్టాండ్‌లో కార్మికులు నిరసన తెలిపారు.

తమ డిమాండ్లను ప్రభుత్వం అంగీకరించాలని విన్నవించారు. యాజమాన్యం మొండి వైఖరి విడనాడాలని, ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఆర్మూర్ డిపో వద్ద కార్మికులు ఆందోళన చేపట్టారు. డిపో నుంచి బస్సులు బయటకు రాలేదు. ఇక ఆర్టీసీ సమ్మె కారణంగా బస్టాండ్లు వెలవెలబోయాయి. బస్సులు రాకపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. బస్టాండ్ల సమీపంలో ప్రైవేట్ వాహనాల రద్దీ ఒక్కసారిగా పెరిగింది. ప్రయాణికుల అవసరాలను ఆసరాగా చేసుకుని ప్రైవేట్ వాహనదారులు విచ్చలవిడిగా రేట్లు పెంచేశారు.
ఆర్టీసీ కార్మికులపై కేసు
కామారెడ్డి(మాచారెడ్డి): కామారెడ్డిలో ఆర్టీసీ కార్మికులపై పోలీసులు కేసు నమోదు చేశారు. బస్టాండ్‌లో విధులు నిర్వహిస్తున్న పోలీసులపై దాడికి పాల్పడ్డారని కండక్టర్ పరమేశ్‌తో పాటు మరికొంత మందిపై కేసులు నమోదు చేసినట్లు కామారెట్టి టౌన్ సీఐ నరహరి బుధవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఆర్టీసీ బస్టాండ్ నుంచి బస్సులు బయటికి వెళ్లే దారిలో కొంతమంది ఆర్టీసీ సిబ్బంది సామాన్య ప్రజలకు ఆటంకం కలిగిస్తున్నందున, అక్కడి నుంచి వెళ్లమని చెప్పిన పోలీసుల మీద దాడి చేశారని సీఐ తెలిపారు. ఈ నేపథ్యంలో కండక్టర్ పరమేశ్‌తో పాటు మరికొంత మందిపై కామారెడ్డి టౌన్ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదు చేసినట్లు చెప్పారు. కండక్టర్‌పై చర్యలు తీసుకోవాలని నిజామాబాద్ ఆర్టీసీ రీజినల్ మేనేజర్‌కు రిపోర్ట్ పంపించినట్లు వివరించారు.
Read Today's Latest Nizamabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
Horse Riding | పిల్లల్లో హైపర్యాక్టివిటీ తగ్గించడంలో గుర్రపు స్వారీ ఎంతో మేలు.. అధ్యయనంలో వెల్లడి..
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
YS Jagan | ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలపై సుప్రీం కోర్టుకు వెళ్తాం : వైఎస్ జగన్
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

