land resurvey | భూముల రీసర్వేకు ప్రతీ ఒక్కరూ సహకరించాలి.. ఏడీ శ్రీనివాస్
సిరికొండ మండలంలోని పెద్ద వాల్గోట్ గ్రామాన్ని పైలట్ గ్రామంగా ఎంపిక చేసి భూముల రీసర్వే చేస్తున్నట్లు ఏడీ శ్రీనివాస్ సూచించారు. వాల్గోట్ గ్రామంలో బుధవారం గ్రామ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. సర్వేకు రైతులందరూ సహకరించాలని కోరారు.
land resurvey | సిరికొండ, అక్టోబర్ 14 : సిరికొండ మండలంలోని పెద్ద వాల్గోట్ గ్రామాన్ని పైలట్ గ్రామంగా ఎంపిక చేసి భూముల రీసర్వే చేస్తున్నట్లు ఏడీ శ్రీనివాస్ సూచించారు. వాల్గోట్ గ్రామంలో బుధవారం గ్రామ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. సర్వేకు రైతులందరూ సహకరించాలని కోరారు. గ్రామంలో నెలకొన్న ఏళ్ల సమస్య తీర్చడానికి ప్రభుత్వం మంచి నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. గ్రామీణ ప్రాంత ప్రజలు ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
వివాదం లేకుండా గ్రామీణ ప్రజలు సహకరించుకుంటే సమస్య పరిష్కారం దొరుకుతుందని అన్నారు. ప్రభుత్వం సర్వే చేసి హద్దులు గుర్తించి భూ దార్ కార్డులు ఇస్తుందని అన్నారు. అధికారులు ఎలాంటి తప్పులు దొర్లకుండా సర్వే పరదర్శికంగా చేయాలనీ ఆదేశించారు. సర్పంచ్ వనిత నర్సింగ్, తహసీల్దార్ రవీందర్ రావు, ఎంపీడీవో ఆరిఫ్ అహ్మద్, వీడీసీ చైర్మన్ తలకట్ల చిన్న గంగారెడ్డి, నర్సారెడ్డి, రాములు, రైతులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Nizamabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
బూర్గంపహాడ్లో ఇసుక అక్రమ రవాణాపై టాస్క్ఫోర్స్ దాడులు
Kuravi | అమ్మమ్మ ఇంటికొచ్చి అనంతలోకాలకు.. నీటి గుంతలో పడి తొమ్మిదేళ్ల బాలుడి మృతి
Pneumonic Plague | న్యుమోనిక్ ప్లేగు అంటే ఏమిటి.. ప్లేగులో ఎన్ని రకాలు ఉన్నాయి..?
Punjab | డ్రగ్స్ వ్యతిరేక కార్యకర్త హత్య కేసు.. నిందితుడి ఇల్లు కూల్చివేత.. షాపు దహనం
Election Schedule | ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదల.. మూడు విడతలుగా ఎన్నికలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

