
MLA Vemula Prashanth Reddy | వేల్పూర్ : బాల్కొండ నియోజకవర్గంలోని ముచ్కూర్, ఎర్గట్ల, పచ్చలనడ్కూడ గ్రామాల హైస్కూళ్లకు మాజీ మంత్రి, ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి సౌజన్యంతో పారిశ్రామిక వేత్త అయిన తన వియ్యంకుడు ఏనుగు దయానంద్ రెడ్డి పలు ప్రభుత్వ పాఠశాలలకు రూ.ఆరు లక్షల విలువగల సైన్స్ ల్యాబ్ మెటీరియల్‌ను అందజేశారు. కాగా మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి వేల్పూర్‌లో ని తన నివాసంలో సోమవారం పలు పాఠశాలలకు అందజేశారు. ఈ సందర్భంగా ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ విద్యార్థులకు ప్రయోగాత్మక విద్యను అందించేందుకు, సైన్స్‌పై ఆసక్తిని పెంపొందించేందుకు ఈ ల్యాబ్ మెటీరియల్ ఎంతగానో ఉపయోగపడుతుందని వేముల ప్రశాంత్ రెడ్డి పేర్కొన్నారు.
విద్యార్థులకు మెరుగైన మౌలిక వసతులు కల్పించేందుకు తన వియ్యంకుడు దయానంద రెడ్డి ముందుకు రావడం అభినందనీయమని, విద్యా రంగానికి అయన అందిస్తున్న సహకారం విద్యార్థుల భవిష్యత్‌కు ఎంతో దోహదపడుతుందని ఈ సందర్భంగా వేముల ప్రశాంత్ రెడ్డి పేర్కొన్నారు. ఉన్నతమైన విద్యను విద్యార్థులకు అందించడానికి ఇకముందు కూడా అవసరం ఉన్న చోట మా సహాయ సహాకారాలు ఉంటాయని ఎమ్మెల్యే పేర్కొన్నారు. అలాగే భీంగల్ మండల కేంద్రంలోని కస్తూరిబా గాంధీ బాలికల పాఠశాలకు రూ.1,46,650 విలువైన 35 డ్యూయల్ డెస్క్ బెంచీలను పాఠశాల యాజమాన్యానికి అందజేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్‌లు, స్థానిక నాయకులు, కార్యకర్తలు, పాఠశాలల ఉపాధ్యాయులు, యాజమాన్య ప్రతినిధులు, గ్రామభివృద్ధి కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.