ఖాళీ బిందెలతో రాస్తారోకో
తాగునీటి ఇబ్బందులు పరిష్కంచాలని కోరుతూ నాగిరెడ్డిపేట మండల కేంద్రంలోని గోపాల్పేట్ పంచాయతీ పరిధిలోని సాయినగర్ కాలనీవాసులు మంగళవారం ఖాళీ బిందెలతోబోధన్- హైదరాబాద్ రహదారిపై బైఠాయించి రాస్తారోకో చేశారు.
- నాలుగు రోజులుగా తాగునీటి కోసం అవస్థలు
- ఆగ్రహంతో రోడ్డెక్కిన మహిళలు
- గంటకు పైగా నిలిచిన రాకపోకలు
- పంచాయతీ కార్యదర్శి నిర్లక్ష్య వైఖరి
నీళ్లంటే విస్తరాకులా.. చెట్లపై నుంచి తెచ్చి ఇవ్వడానికి.. టైం పడుతుంది.. వంద మంది కాదు.. వెయ్యి మంది వచ్చి ఖాళీ బిందెలతో కూర్చున్నా నేనేం చేయలేను..
ఇవి తాగునీటి సమస్య పరిష్కరించాలని కోరిన ప్రజలతో పంచాయతీ కార్యదర్శి మాట్లాడిన మాటలు.
నాగిరెడ్డిపేట, మే 28: తాగునీటి ఇబ్బందులు పరిష్కంచాలని కోరుతూ నాగిరెడ్డిపేట మండల కేంద్రంలోని గోపాల్పేట్ పంచాయతీ పరిధిలోని సాయినగర్ కాలనీవాసులు మంగళవారం ఖాళీ బిందెలతోబోధన్- హైదరాబాద్ రహదారిపై బైఠాయించి రాస్తారోకో చేశారు. ఈ సందర్భంగా అధికారులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. గంట పాటు ప్రజలు నిరసన తెలపడంతో రోడ్డుకు ఇరువైపులా పెద్ద సంఖ్యలో వాహనాలు నిలిచిపోయాయి. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని ఆందోళనకారులతో మాట్లాడారు. కాలనీకి చెందిన బోరుమోటర్ చెడిపోయి నాలుగు రోజులుగా తాగునీరు రావడం లేదన్నా రు. తాగునీటి ఇబ్బందులపై పంచాయతీ కార్యదర్శి కిష్టయ్యను అడిగితే స్పందించడం లేదని.. దీంతో తాగునీటి కోసం రోడ్డెక్కాల్సిన పరిస్థితి వచ్చిందని ఆవేదన వ్యక్తంచేశారు.
నీళ్లంటే విస్తరాకులా..
ఆందోళన చేస్తున్న ప్రాంతం నుంచి పోలీసులు పంచాయతీ కార్యదర్శితో ఫోన్లో మాట్లాడారు. దీంతో పంచాయతీ కార్యదర్శి కిష్టయ్య మాట్లాడుతూ నీళ్లంటే ఇస్తరాకులా.. చెట్లపైన నుంచి తెచ్చి ఇవ్వడానికీ.. టైం పడుతది..వంద మంది కాదు.. వేయ్యి మంది ఖాళీబిందెలతో వచ్చి రోడ్డుపై కూర్చున్నా నేనేం చేయలేను.. అంటూ దురుసుగా మాట్లాడి కాల్ కట్ చేశాడు. ఇది విన్న ప్రజలు ఆగ్రహంతో పంచాయతీ కార్యదర్శి తీరుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కార్యదర్శి వచ్చి సమస్య పరిష్కరించేవరకు రోడ్డుపై నుంచి లేవమంటూ భీష్మించుకూర్చోవడంతో పోలీసులు మళ్లీ పంచాయతీ కార్యదర్శి కిష్టయ్యకు ఫోన్ చేయగా స్వీచ్ ఆఫ్ చేసినట్లు వారు తెలిపారు. దీంతో పోలీసులు ప్రజలను సముదాయించి రోడ్డుపై నుంచి పక్కకు తీసుకువెళ్లడంతో అక్కడి నుంచి వారు ఎంపీడీవో కార్యాలయం చేరుకొని ధర్నా చేశారు. పోలీసులు విషయాన్ని డీఎల్పీవో సురేందర్‌కు ఫోన్ ద్వారా తెలిపారు. బుధవారంలోగా తాగునీటి సమస్యను పరిష్కరిస్తామని డీఎల్పీవో హామీ ఇవ్వడంతో ప్రజలు శాంతించి వెనుదిరిగారు. స్థానికంగా ఉండకుండా విధుల్లో దురుసుగా ప్రవర్తిస్తున్న కార్యదర్శిపై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. సమస్య పరిష్కారం కాని పక్షంలో బుధవారం మళ్లీ రాస్తారోకో చేపడతామని ప్రజలు హెచ్చరించారు
Read Today's Latest Nizamabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KCR | ప్రజల కష్టాలు తొలగి, సర్వ సంపదలు చేకూరాలి..రాష్ట్ర ప్రజలకు కేసీఆర్ దీపావళి శుభాకాంక్షలు
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
నల్లగొండ ఎన్జీ కళాశాలలో అతిథి అధ్యాపక పోస్టుకు దరఖాస్తుల ఆహ్వానం
‘నేల ఆరోగ్య పరిరక్షణకు ప్రాధాన్యత ఇవ్వాలి’
Accident | పెళ్లి జరగాల్సిన ఇంట్లో విషాదం.. వెడ్డింగ్ కార్డ్స్ పంచేందుకు వెళ్తుంటే..
ట్రెండింగ్ వార్తలు
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?

