బీజేపీ మాటలు నమ్మొద్దు
ప్రతిపక్షాలు రైతులను అనవసరంగా రెచ్చ గొడుతున్నాయని.. కామారెడ్డి మాస్టర్ ప్లాన్ రైతుల అభీష్టం మేరకే ఉంటుందని రాష్ట్ర రోడ్డు, భవనాలు శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి స్పష్టం చేశారు.
- ప్రజల అభీష్టం మేరకే కామారెడ్డి మాస్టర్‌ప్లాన్‌పై తుది నిర్ణయం
- రైతులను కడుపులో పెట్టుకొని చూసుకునే ప్రభుత్వం మాది
- మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి
- బండి సంజయ్.. నోరు జాగ్రత్త
- బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడికి మంత్రి హెచ్చరిక
కామారెడ్డి మాస్టర్‌ప్లాన్ రైతుల అభీష్టం మేరకు ఉంటుంది. ప్రతిపక్షాలు అనవసరంగా అన్నదాతలను రెచ్చగొడుతున్నాయి. రైతుల రక్తాన్ని పీల్చుకుని తింటున్న రాకాసి బీజేపీ మాయమాటలను దయచేసి రైతులు ఎవ్వరూ నమ్మొద్దు. తెలంగాణలో ఉన్నది రైతు ప్రభుత్వం. రైతులను కడుపులో పెట్టుకుని కాపాడుకునే ప్రభుత్వం మాది. బండి సంజయ్.. నోరు జాగ్రత్త.. రైతులకు ఏం చేయాలో నీతో చెప్పించుకోవాల్సిన అవసరం మాకు లేదు.
– మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి
నిజామాబాద్, జనవరి 6 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ప్రతిపక్షాలు రైతులను అనవసరంగా రెచ్చ గొడుతున్నాయని.. కామారెడ్డి మాస్టర్ ప్లాన్ రైతుల అభీష్టం మేరకే ఉంటుందని రాష్ట్ర రోడ్డు, భవనాలు శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి స్పష్టం చేశారు. బండి సంజయ్ శుక్రవారం కామారెడ్డిలో నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘నోరు జాగ్రత్త… బండి సంజయ్’ అంటూ మంత్రి తీవ్ర స్థాయిలో హెచ్చరించారు. రైతుల కోసం ఏమి చేయాలో నీతో చెప్పించు కోవాల్సిన గత్యంతరం మాకు పట్టలేదన్నారు.
దేశం మొత్తంలో అత్యంత గొప్పగా గౌరవింపబడుతున్న రైతు తెలంగాణ రైతు మాత్రమేనని మంత్రి వెల్లడించారు. రైతులకు ఏమీ చేయాలో తమకు తెలుసని కేంద్రంలో ఉన్న నీ బీజేపీ ప్రభుత్వానికి నీ సలహాలు ఇవ్వు అని చురకలు అంటించారు. రైతు ఆదాయం రెట్టింపు చేస్తామని చెప్పిన కేంద్రం మద్దతు ధర ఇవ్వకపోగా ఎరువులు ధరలు మూడు రెట్లు పెంచి రైతుల నడ్డి విరుస్తోందని మండిపడ్డారు. ప్రశ్నించిన రైతులను ఢిల్లీలో వాహనాలతో తొక్కించిన చరిత్ర బీజేపీదేనని విమర్శించారు.
వ్యవసాయ రంగాన్ని నిర్వీర్యం చేస్తూ రైతులను అరిగోస పెడుతూ నిండా ముంచుతున్నారని ధ్వజమెత్తారు. అట్లాంటి వారు తమ రైతు కోసం మొసలి కన్నీరు కారిస్తే ఎవరూ నమ్మరన్నారు. కేవలం రాజకీయ లబ్ధి కోసమే తన హైకమాండ్ ఆదేశాల మేరకు కామారెడ్డిలో బండి సంజయ్ డ్రామాకు తెరలేపాడని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. బండి సంజయ్‌కు చేతనైతే కేంద్రంతో మాట్లాడి సిలిండర్ ధర తగ్గించాలన్నారు. వ్యవసాయ రంగంపై వేసే పన్నులను తగ్గించాలని, ప్రతి ఒక్కరి అకౌంట్లో రూ.15లక్షలు వేస్తామన్న మోదీకి చెప్పి డబ్బులు జమ చేయించాలన్నారు.
తెలంగాణ అభివృద్ధికి అన్ని విధాలుగా అడ్డుకుంటున్న కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వాన్ని ఒప్పించే దమ్ముంటే మెడికల్ కాలేజీలు తీసుకురా అంటూ సవాల్ విసిరారు. తెలంగాణకు రావాల్సిన నిధులను కేంద్రం ఇతర రాష్ర్టాలకు మళ్లిస్తోందన్నారు. రైతుల రక్తాన్ని పీలుస్తున్న రాకాసి బీజేపీ మాయమాటలను దయచేసి రైతులు ఎవ్వరూ నమ్మొద్దని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఇక్కడ ఉన్నది రైతు ప్రభుత్వమని, రైతులను కడుపులో పెట్టుకుని కాపాడుకుంటమని మంత్రి తెలిపారు. సంయమనం పాటించాలని రైతులకు మంత్రి వేముల విన్నవించారు.
Read Today's Latest Nizamabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Singer Daler Mehndi | మాట్లాడటమే రావడం లేదు, ఇక పాటలు ఎలా పాడతారు?.. సింగర్ దాలెర్ మెహందీని నిలదీసిన మంత్రి!
Parvesh Verma | యయునా నది వెంట బర్త్‌డే వేడుకలు జరుపుకోండి : ఢిల్లీ మంత్రి
Dussehra Special | తొమ్మిది రోజులు కూర్చోరు.. నేలపై పడుకోరు! ఈ గ్రామంలో దసరా నవరాత్రుల్లో వింత మొక్కు!
Idupu Kayitham | దసరా శుభాకాంక్షలు తెలిపిన ‘ఇడుపు కాయితం’ టీమ్.. ఆకట్టుకునే కొత్త పోస్టర్ విడుదల!
KTR | జమ్మి పూజ, పాలపిట్ట దర్శనం.. తెలంగాణ సంప్రదాయాన్ని గుర్తు చేస్తూ కేటీఆర్ దసరా శుభాకాంక్షలు!
ట్రెండింగ్ వార్తలు
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!

