బాన్సువాడ రూరల్, జూన్ 23: నిజామాబాద్ జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణానికి చెందిన ప్రముఖ డ్యాన్స్ మాస్టర్ అన్నం అనిల్ (34) మంగళవారం ఉదయం నిజామాబాద్ సమీపంలోని గాంధీ నగర్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. ప్రత్యక్ష సాక్షులు తెలిపిన వివరాల ప్రకారం.. బాన్సువాడ నుండి నిజామాబాద్‌కు బైక్‌పై వెళ్తున్న అనిల్‌ను ఎదురుగా వస్తున్న ఆర్టీసీ బస్సు ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడు.
కాగా, అనిల్ బాన్సువాడ పట్టణంలో నటరాజ్ డ్యాన్స్ అకాడమీని నిర్వహిస్తున్నాడు. అనిల్ మృతితో బాన్సువాడ పట్టణంలో తీవ్ర విషాదం నెలకొంది. మంచి డ్యాన్స్ మాస్టర్‌గా అందరి మన్ననలు పొందిన అనిల్ అకాల మరణాన్ని కళాకారులు, స్నేహితులు జీర్ణించుకోలేకపోతున్నారు. పోస్టుమార్టం అనంతరం ఆయన అంత్యక్రియలు బాన్సువాడలో నిర్వహించనున్నట్లు అతని కుటుంబీకులు తెలిపారు.