బహుముఖ వ్యూహం అలుపెరుగని యుద్ధం

- ప్రాణాలు పణంగా పెట్టి పనిచేస్తున్న వైద్యులు
- ప్రభుత్వ, ప్రైవేటు దవాఖానల్లో నిర్విరామంగా సేవలు
- ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో జోరుగా పరీక్షలు, వ్యాక్సినేషన్
- వ్యాధి ప్రబలకుండా వేర్వేరుగా ప్రక్రియ
- ప్రజల ప్రాణాలు కాపాడేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి
- మాస్కు వాడకంపై ప్రజల్లో పెరిగిన అవగాహన..
- నైట్ కర్ఫ్యూతో రద్దీ కట్టడి
నిజామాబాద్, ఏప్రిల్ 24, (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : కరోనా సృష్టిస్తున్న విధ్వంసాన్ని రాష్ట్ర ప్రభుత్వం తనదైన శైలిలో అడ్డుకుంటున్నది. ప్రభుత్వ, ప్రైవేటు దవాఖానల్లో అత్యవసర సేవలు కొనసాగిస్తూ ఎప్పటికప్పుడు చర్యలు చేపడుతున్నది. సెకండ్ వేవ్‌లో కరోనా వైరస్ కోరలు చాస్తున్న నేపథ్యంలో ఆక్సిజన్, వెంటిలేటర్ల సౌకర్యాన్ని భారీగా పెంచింది. ప్రైవేటు దవాఖానలకు కొవిడ్-19 చికిత్సకు అవకాశాలు కల్పించడంతో పాటు సామాజిక ఆరోగ్య కేంద్రాలు, ఏరియా, జిల్లా ప్రభుత్వ వైద్యశాలల్ల్లో పడకల సంఖ్యను భారీగా పెంచింది. రెమ్‌డెసివిర్ ఇంజక్షన్ కొరత లేకుండా ఎప్పటికప్పుడు యుద్ధప్రాతిపదికన చర్యలు తీసుకుంటున్నది. కరోనా వ్యాప్తి వేగంగా జరుగుతున్న నేపథ్యం లో టెస్టింగ్ కోసం వస్తున్న ప్రజలకు పరీక్షలు నిర్వహించేలా ఏర్పాట్లు చేస్తున్నది. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ఓ వైపు వాక్సినేషన్ ప్రక్రియను, మరోవైపు కరోనా నిర్ధారణను వేగంగా చేస్తోంది. నెల రోజుల్లో కరోనా పరీక్షలు, వాక్సినేషన్ భారీగా పెరిగింది. వైద్యులు, వైద్య సిబ్బంది తమ ప్రాణాలు పణంగా పెట్టి కరోనా బాధితులకు నిరంతర సేవలు అందిస్తున్నారు. తమ కుటుంబాలను కాదని కరోనాతో బాధపడుతున్న వారి బాగు కోసం తీవ్రంగా శ్రమిస్తున్నారు.
ప్రైవేటుకు అనుమతులు…
- కరోనా కరాళ నృత్యం చేస్తోంది. నిజామాబాద్, కామారెడ్డి జిల్లాలోనూ వేగంగా వైరస్ వ్యాపిస్తోంది.
- నిర్లక్ష్యం మూలంగా పలువురు ప్రాణాలు సైతం కోల్పోతున్నారు.
- రోజు రోజుకూ వ్యాధి బారిన పడిన వారి సంఖ్య పెరుగుతుండడంతో చికిత్స పొందేందుకు నిజామాబాద్ నగరానికి లేదంటే హైదరాబాద్‌కు పయనం అవుతున్నారు.
- అక్కడా రద్దీ ఉంటుండడంతో దవాఖానలో అడ్మిట్ కా వడానికి నానా తంటాలు పడాల్సి వస్తోంది.
- దీంతో రాష్ట్ర ప్రభుత్వం కీలకమైన నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ దవాఖానలకు పరిమితమైన కొవిడ్ -19 చికిత్సను ఇకపై ప్రైవేటు వైద్యశాలల్లోనూ అందించేలా అనుమతి ఇచ్చింది.
- ఈ మేరకు నిజామాబాద్ జిల్లాలో 22 ప్రైవేటు దవాఖానలకు అవకాశం లభించింది.
- పడకలతో పాటు ఆక్సిజన్ సిలిండర్లు, వెంటిలేటర్‌తో కూడిన ఐసీయూ వసతులు ఆయా దవాఖానల్ల్లో ఉన్నాయి.
- గతేడాది కరోనా వ్యాప్తి మొదలు కాగానే జిల్లా కేంద్రంలోని జనరల్ హాస్పిటల్లో 500 పడకలతో ప్రత్యేకంగా వార్డు ఏర్పాటు చేశారు.
- రెండో వేవ్‌లో పాజిటివ్ కేసులు పెరుగుతుండడంతో ఆర్మూర్, బోధన్ దవాఖానల్లో ఆక్సిజన్, ఐసీయూ బెడ్లు అమర్చారు.
- ఆక్సిజన్ సిలిండర్లు, ఐసీయూ అందుబాటులోకి తీసుకు రావడంతో రోగులు చికిత్స పొందుతూ వచ్చారు.
నైట్ కర్ఫ్యూతో కట్టడి…
- రోజురోజుకూ భయానకంగా మారుతున్న కరోనా దుస్థితి నుంచి బయటపడేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేయని ప్రయత్నం లేదు.
- ప్రజలను అప్రమత్తం చేస్తూనే కరోనా బారిన పడకుండా ఉండేందుకు అవగాహన కల్పిస్తున్నది.
- మాస్కులు ధరించడాన్ని తప్పనిసరి చేయడంతో పాటు ఇప్పటికే సామూహిక కార్యక్రమాలను రద్దు చేసుకోవాలని సూచించింది.
- అంతేకాకుండా రాత్రి కర్ఫ్యూను సైతం పకడ్బందీగా అమలు చేస్తూ ప్రజలను ఇండ్లకు పరిమితం చేసింది.
- తద్వారా కరోనా వ్యాప్తిని నిరోధించేందుకు అవకాశం ఏర్పడింది.
- ఇదిలా ఉండగా దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారు కరోనా బారిన పడి… నిర్లక్ష్యం చేయడంతో ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు.
- వృద్ధులు, ఇతర వ్యాధులతో బాధపడుతున్న వారికి ప్రమాదం ముంచుకొస్తోంది.
- ఇటీవల కొంత మంది వ్యక్తులు కరోనా సోకిన తర్వాత ఇంట్లోనే చికిత్స తీసుకోగా పరిస్థితి చేయి దాటి ఆగమాగం అవుతున్నారు.
- కుటుంబ సభ్యులు ప్రైవేటు దవాఖానలకు తరలిస్తున్నారు.
- అక్కడ చికిత్స పొందు తూ అనేక మంది ప్రాణాలు వదులుతున్నారు.
- మరణాలు తగ్గించేందుకు ప్రైవేటు దవాఖానల్లో వైద్య సేవ లు అందించడానికి మార్గం సుగమం అయ్యింది.
- ప్రతి వైద్యశాలకు వైద్య ఆరోగ్య శాఖ అధికారులు ఐడీ, పాస్ వర్డ్ కేటాయించారు.
- రోజువారీగా చికిత్స అందించిన రోగుల వివరాలతో పాటు పడకల ఖాళీలను తప్పకుం డా పొందుపర్చాలి.
- మొత్తంగా ఎన్ని పడకలు అందుబాటులో ఉన్నాయి. ఎన్ని బెడ్లలో వ్యాధిగ్రస్తులకు చికి త్స అందిస్తున్నారో స్పష్టంగా తెలియజేయాల్సి ఉంది.
ఉభయ జిల్లాలో వేలల్లో టెస్టులు…
కరోనా కోరలు చాస్తుండడంతో నిత్యం వందలాది మంది వైరస్ బారిన పడుతున్నారు. నెల రోజుల క్రితం నిజామాబాద్ జిల్లాలో కేవలం రోజుకు 500 టెస్టులు మాత్రమే జరుగగా ప్రస్తుతం ఈ సంఖ్య వేలకు చేరింది.
జోరుగా వ్యాక్సినేషన్…
- నిజామాబాద్ జిల్లాలో 45 పైబడిన వారికి ఇప్పటి వర కు 74వేల 84 మందికి వ్యాక్సిన్ ఇచ్చారు.
- ఇందులో ప్రైవేటులో 4,944 మంది, ప్రభుత్వ సెంటర్లలో 69,140 మంది వ్యాక్సిన్ పొందారు.
- కొవిడ్ నియంత్రణలో అలుపెరగని పోరాటం చేస్తున్న వైద్యులు, వైద్య సిబ్బంది, పారామెడికల్ సిబ్బందితో పాటు ప్రైవేటు దవాఖానల్లో పని చేస్తున్న వారందరితో పాటుగా పోలీసులు, వివిధ ప్రభుత్వ శాఖలకు చెందిన ఉద్యోగులకు ఫ్రంట్ లైన్ వారియర్స్‌గా ప్రభుత్వం గుర్తించింది.
- వీరికి కూడా వ్యాక్సిన్ అందించారు.
- 10,707 మంది ఫ్రంట్ లైన్ వర్కర్లకు టీకాలు తీసుకున్నారు.
- మొత్తం ప్రభుత్వ నిబంధనలకు మేరకు ఫ్రంట్ లైన్ వర్కర్లతో పాటుగా 45 ఏండ్లు పైబడిన వారిని కలిపితే నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా లక్షా 26వేల 483 మందికి టీకా అందించారు.
- ప్రభుత్వం టీకా కేంద్రాల్లో లక్షా 19వేల 205 మంది, ప్రైవేటు టీకా కేంద్రాల్లో 7వేల 278 మంది ఉన్నారు.
- టీకా తీసుకున్న వారిలో 60 ఏండ్లు పైబడిన వారు 24వేల మంది, 45-59 ఏండ్లు ఉన్న వారు 71వేల 377 మంది ఉన్నట్లుగా వైద్య శాఖ గణాంకాలు చెబుతున్నాయి.
- దేశవ్యాప్తంగా కొవిడ్ నియంత్రణకు రెండు టీకాలను కేంద్ర ప్రభుత్వం అనుమతిచ్చింది.
- కొవిషీల్డ్, కొవాగ్జీన్ టీకాల పంపిణీ క్షేత్ర స్థాయిలో చురుగ్గా సాగుతున్నది.
- నిజామాబాద్ జిల్లాలో 22 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ఏరియా, జిల్లా దవాఖాన ల్లో అందుబాటులో ఉన్న టీకాలను అనుసరించి వ్యాక్సినేషన్ చేపడుతున్నారు.
Read Today's Latest Nizamabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
BCCI | బీసీసీఐ నెట్‌వర్త్ తెలిస్తే షాకే.. టాప్ 10 రిచెస్ట్ క్రికెట్ బోర్డులివే
రోడ్డు ప్రమాదాల నివారణకు పటిష్ట చర్యలు : డీఆర్వో పద్మావతి
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

