ఆర్మూర్‌టౌన్, జనవరి24: ఆర్మూర్ మున్సిపల్ నూతన చైర్మన్ ఎన్నికను వెంటనే నిర్వహించాలని స్థానిక కౌన్సిలర్లు కోరారు. ఈ మేరకు మాజీ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి ఆధ్వర్యంలో బీఆర్ఎస్ మున్సిపల్ కౌన్సిలర్లు బుధవారం మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ముఖ్య కార్యదర్శి దాన కిశోర్‌కు వినతిపత్రం అందజేశారు.
ఆర్మూర్‌లో నూతన చైర్మన్ ఎన్నిక చేపట్టకుండా పక్షపాత ధోరణి అవలంబిస్తున్నారని కౌన్సిలర్లు ఆవేదన వ్యక్తం చేశారు. మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అధికారి స్పందించి త్వరలోనే ఎన్నికల తేదీని ప్రకటించేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.