వెల్లువలా మద్దతు
బీఆర్ఎస్ పార్టీకి ఊరూరా మద్దతు వెల్లువెత్తుతున్నది. ఏకగ్రీవ తీర్మానాలతో జనం గులాబీ పార్టీకి అండగా నిలుస్తున్నారు. నిజామాబాద్ రూరల్‌లో ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్‌కు వందలాది కుటుంబాలు మంగళవారం జైకొట్టాయి. వచ్చే ఎన్నికల్లో ఆయనకే ఓటు వేసి గెలిపించుకుంటామని తీర్మానించాయి.
- బీఆర్ఎస్ అభ్యర్థులకు ఊరూరా బ్రహ్మరథం
- ఏకగ్రీవ తీర్మానాలతో వెంట నిలుస్తున్న జనం
- బాజిరెడ్డికి జైకొట్టిన వందలాది కుటుంబాలు
- భారీ మెజార్టీతో గెలిపించుకుంటామని తీర్మానాలు
బీఆర్ఎస్ పార్టీకి ఊరూరా మద్దతు వెల్లువెత్తుతున్నది. ఏకగ్రీవ తీర్మానాలతో జనం గులాబీ పార్టీకి అండగా నిలుస్తున్నారు. నిజామాబాద్ రూరల్‌లో ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్‌కు వందలాది కుటుంబాలు మంగళవారం జైకొట్టాయి. వచ్చే ఎన్నికల్లో ఆయనకే ఓటు వేసి గెలిపించుకుంటామని తీర్మానించాయి.
– డిచ్పల్లి/నిజామాబాద్ రూరల్, నవంబర్ 7
నిజామాబాద్ రూరల్/డిచ్పల్లి/బీబీపేట్, నవంబర్ 7: రాష్ట్రాన్నిఅన్నిరంగాల్లో అభివృద్ధి చేసి దేశంలోనే అగ్రగామిగా నిలిపిన బీఆర్ఎస్ను మరోసారి గెలిపించుకునేందుకు అన్ని వర్గాల ప్రజలు మందుకు వస్తున్నారు. ఇందులో భాగంగా ఆయా నియోజకవర్గాల నుంచి పోటీ చేస్తున్న బీఆర్ఎస్ అభ్యర్థులకు సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నారు. నిజామాబాద్ రూరల్ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్‌కు డిచ్పల్లి మండలం ఖిల్లా డిచ్పల్లికి చెందిన 150 ముదిరాజ్ కుటుంబాలు, 200 మంది అంబేద్కర్ యూత్, లాల్ బహదూర్, జై భీం యూత్ సభ్యులు, ధర్పల్లి మండలం హోన్నాజీపేట గ్రామ యాదవ కులస్తులు 100 మంది కారుగుర్తుకే ఓటేస్తామని ఏకగ్రీవంగా తీర్మానం చేశారు. తీర్మాన పత్రాలను బాజిరెడ్డికి గోవర్ధన్‌కు మంగళవారం అందజేశారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ, రూరల్ సెగ్మెంట్ ఎన్నికల ఇన్చార్జి వీజీగౌడ్, నుడా చైర్మన్ ఈగ సంజీవ్‌రెడ్డి, ధర్పల్లి జడ్పీటీసీ బాజిరెడ్డి జగన్‌లు పాల్గొన్నారు.
సీఎం కేసీఆర్ వెంటే ముదిరాజ్ సంఘ మహిళలు..
కామారెడ్డి నుంచి కేసీఆర్‌ను భారీ మెజారిటీతో గెలిపించుకుంటామని బీబీపేట్ మండలం జనగామకు చెందిన ముదిరాజ్ సంఘ మహిళలు ముక్తకంఠంతో తెలిపారు. బీఆర్ఎస్కు సంపూర్ణ మద్దతు ప్రకటిస్తూ కామారెడ్డి నియోజకవర్గ ఎన్నికల సమన్వయ కమిటీ సభ్యుడు తిమ్మయ్యగారి సుభాష్‌రెడ్డి ఆధ్వర్యంలో తీర్మానం చేశారు. కార్యక్రమంలో సర్పంచుల ఫోరం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మహిపాల్‌రెడ్డి, ఎంపీపీ బాలమణి, వైస్ ఎంపీపీ రవీందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Nizamabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

