Bodhan | బోధన్ : బాలల ఆరోగ్యమే దేశానికి శ్రీరామ రక్ష అని బోధన్ ఐసీడీఎస్ సీడీపీవో నందిని, మోస్రా సూపర్ వైజర్ సుమలత అన్నారు. జాతీయ పోషణ మాసోత్సవాలు సందర్భంగా మంగళవారం మోస్రా మండలం రైతు వేదిక లో ఏర్పాటు చేసిన పోషణ మాసం కార్యక్రమానికి వారు హాజరై గర్భిణీలు, బాలింతలకు సలహాలు, సూచనలు అందజేశారు. గర్భిణులకు సీమంతం వేడుకలు, చిన్నారులకు అక్షరాభ్యాసం చేయించారు. గర్భిణులు, బాలింతలు సమతుల ఆహారం తీసుకోవాలని సూచించారు.
కిషోర బాలికలు పాటించాల్సిన ఆరోగ్య సూత్రాలు, గర్భిణులు, బాలింతలు తీసుకోవాల్సిన పౌష్టికాహారం గురించి వివరించారు. గర్భం దాల్చిన మొదటి రోజు నుంచి 1000 రోజుల వరకు ఉన్న ప్రాముఖ్యత, తీసుకోవాల్సిన ఆహారం జాగ్రత్తలను తెలియజేశారు. ఈ సందర్భంగా గర్భిణులకు సీమంతం, ఆరు నెలల చిన్నారులకు అన్నప్రాసన చేయింంచారు. ఈ కార్యక్రమంలో రుద్రూర్ సూపర్ వైజర్ శృతి, ఏడపల్లి సూపర్ వైజర్ సావిత్రి, అంగన్వాడి టీచర్లు, గర్భిణులు, బాలింతలు తదితరులు పాల్గొన్నారు.